
- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకు కేసులు భీకరంగా పెరుగుతున్నాయి. నేడు ఒక్క రోజే ఏకంగా 127 కరోనా కేసులు నమోదైనట్టు ప్రభుత్వం తాజా హెల్త్ బులెటిన్‌లో తెలిపింది.
నేడు నమోదైన కేసులన్నీ రాష్ట్రానికి చెందినవే కావడం గమనార్హం. వీటితో కలుపుకుని రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3147కు చేరుకుంది.
అలాగే నేడు కరోనా కాటుకు మరో ఆరుగురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 105కి చేరుకుంది.
గురువారం నాడు గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ కొత్తగా కేసులు నమోదుకావడం కలవర పరుస్తోంది.
ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 110 కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 6, ఆదిలాబాద్‌లో 7, మేడ్చల్‌లో 2, సంగారెడ్డి, ఖమ్మంలో ఒక్కొక్కటి చొప్పున కొత్త కేసులను గుర్తించారు.
ఇక నాన్ లోకల్ కేసుల్లో గురువారం సున్నా కేసులు నమోదైనట్లు వెల్లడించారు.
- Advertisement -








