
హైదరాబాద్: హజీపూర్ వరుస హత్యలతో కలకలం రేపిన సైకో శ్రీనివాస్ రెడ్డి హత్యోందతాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయ్. ఇప్పుడు తాజాగా మరో నమ్మలేని నిజం వెలుగు చూసింది. ఇప్పటికే ముగ్గురు అమ్మాయిలను పొట్టనబెట్టుకున్న సైకో శ్రీనివాస్ …. వరంగల్ జిల్లాకు చెందిన ఓ జంటను చంపి ఉంటాడని అనుమానిస్తున్నారు పోలీసులు.
చదవండి: నిజామాబాద్ లోక్‌సభ ఎన్నిక: ‘కంట్రీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు…
మామిడి తోటలో పని ఇప్పిస్తానని చెప్పి… ఓ జంటను హజీపూర్ కు తీసుకొచ్చిన శ్రీనివాస్ వారిని లిఫ్ట్ మెకానిక్ పనుల్లో కుదుర్చాడు. కానీ, కొన్నాళ్ల తర్వాత ఆ జంట కనిపించకుండా పోయిందని చెబుతున్నారు గ్రామస్థులు.
దీంతో వారిని శ్రీనివాస్ రెడ్డే చంపి ఉంటాడని అనుమానిస్తున్న పోలీసులు… దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే నిందితుడు శ్రీనివాస్ రెడ్డి నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి ఫోన్, కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు…. అశ్లీల వెబ్ సైట్ ల కోసం వెతికినట్లు గుర్తించారు.








