25 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియపై రాళ్ల దాడి

ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియపై రాళ్ల దాడి

MLA Haripriya Latest News, Telangana Latest Political News, Newsxpressonline
- Advertisement -

కామేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తెరాస ఎంపీటీసీ అభ్యర్థి తరపున ప్రచారం చేసేందుకు వచ్చిన ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియపై కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు దాడికి దిగారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవింద్రాలలో జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. తెరాస ఎంపీటీసీ అభ్యర్థి లాకవర్తు సునితకు మద్దతుగా ఎమ్మెల్యే హరిప్రియ ప్రచారం నిర్వహించడంపై కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆగ్రహించారు. అంతేకాకుండా ఆమెపై చెప్పులు, రాళ్లతో దాడికి దిగారు. ఈ పరిణామాలతో ఆగ్రహానికి గురైన తెరాస కార్యకర్తలు కూడా కాంగ్రెస్‌ శ్రేణులపై దాడికి దిగారు. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనతో హరిప్రియ తన ప్రచారాన్ని ముగించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా నిలిచిన హరిప్రియను కష్టపడి గెలిపించామని, ఆమె ఇష్టానుసారంగా పార్టీ మారడం ఏమిటని కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రశ్నించారు. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి.

దాడికి పాల్పడిన సమయంలో అక్కడ పోలీసులు ఉన్నప్పటికీ ఇరువర్గాల కార్యకర్తలు అధిక సంఖ్యలో ఉండడంతో వారిని అదుపుచేయడం కష్టతరంగా మారింది. గ్రామంలో నెలకొన్న పరిస్థితులను స్థానిక ఎస్సై తిరుపతిరెడ్డి సమీక్షిస్తున్నారు. ఇరువర్గాల వారిని సముదాయించి పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -