26.3 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ పంచాయితీలో ఓడి..పరిషత్‌లో గెలిచిన ఎంసీఏ విద్యార్ధిని….

పంచాయితీలో ఓడి..పరిషత్‌లో గెలిచిన ఎంసీఏ విద్యార్ధిని….

mca student won mptc in telangana
- Advertisement -

హైదరాబాద్: పట్టు వదలకుండా కృషి చేస్తే ఏదైనా సాధ్యమే అని ఓ ఎంసీఏ విద్యార్దిని నిరూపించింది. నాలుగు నెలలు క్రితం జరిగిన తెలంగాణ పంచాయితీ ఎన్నికల్లో ఓడిపోయిన కరీంనగర్ సుల్తానాబాద్‌కి చెందిన పులి అనూష(23)… తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటింది.

తిమ్మాపూర్‌లోని శ్రీ చైతన్య కళాశాలలో ఎంసీఏ చదువుతున్న అనూష….ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. అయితే ఓడిపోయానని దిగులు పడకుండా…మళ్ళీ సుల్తానాబాద్ గర్రెపల్లి ఎంపీటీసీ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసింది.

అయితే నిన్న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో అనూహ్యంగా టీఆర్ఎస్ అభ్యర్ధిపై అనూష ఘన విజయం సాధించారు. మహిళలకు రిజర్వ్‌ అయిన ఈ స్థానం నుంచి జరిగిన గట్టి పోటీలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పడాల శ్రీజపై అనూష 72 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

కాగా, అనూష మాజీ ఎంపీటీసీ పులి వెంకటేశం కూతురు. ప్రస్తుతం ఆమె కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌లోని శ్రీ చైతన్య కళాశాలలో ఎంసీఏ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఇక చదువుతూనే అతి చిన్న వయసులో ఎంపీటీసీగా  విజయం సాధించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తంచేస్తున్నారు.

చదవండి:  అదృష్టం అంటే వీరిదే…ఒకరు లాటరీలో, మరొకరు ఒక్క ఓటు తేడాతో గెలుపు…
- Advertisement -