28.2 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ ‘ఖాకీ’ సీన్ రిపీట్… రాజస్థాన్‌లో తెలంగాణ పోలీసులపై దాడి!

‘ఖాకీ’ సీన్ రిపీట్… రాజస్థాన్‌లో తెలంగాణ పోలీసులపై దాడి!

- Advertisement -

హైదరాబాద్: హీరో కార్తీ యాంగ్రీ పోలిస్ మెన్ గా నటించిన “ఖాకీ” సినిమా గుర్తుందా. నిందితులను పట్టుకునేందుకు రాజస్థాన్ లోని ఓ గ్రామానికి వెళ్తే .. స్థానికులు ఏకమై పోలీసులను తరిమి కొడతారు. వారిపై బీభత్సంగా దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తారు. అలాంటి ఘటనే రీల్ లో కాకుండా రియల్ గా మన తెలంగాణ పోలీసులకు ఎదురైంది.

చదవండి: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ ఘనవిజయం…

వరంగల్ సుబేదార్ పోలీస్ స్టేషన్ సిబ్బంది … ఓ చోరీ కేసులో నిందితులను పట్టుకునేందుకు రాజస్థాన్ లోని బెల్వాడ జిల్లా హెర్నియ గ్రామానికి వెళ్లారు.

అక్కడికి వెళ్లి నిందితులను స్వాధీనం చేసుకునేందుకు ట్రై చేస్తుండగా… స్థానికులు ఒక్కసారిగా పోలీసులపై అటాక్ చేశారు. తమ గ్రామానికి చెందిన వారినే అరెస్ట్ చేస్తారా అంటూ…. ముగ్గురు పోలీసులను చావబాదారు.

విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు… వెంటనే ఘటనాస్థలికి చేరుకుని వారిని రక్షించారు. గాయపడ్డ తెలంగాణ పోలీసులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికులపై కేసు నమోదు చేసి.. దాడికి పాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -