23.7 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home కేఏ పాల్ కార్నర్ ఎవరితోనైనా పెట్టుకోండి.. నాతో కాదు: కేటీఆర్‌కి కేఏ పాల్ వార్నింగ్!

ఎవరితోనైనా పెట్టుకోండి.. నాతో కాదు: కేటీఆర్‌కి కేఏ పాల్ వార్నింగ్!

- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లే లక్ష్యంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ….ఎవరితోనైనా పెట్టుకోండి కానీ తనతో పెట్టుకోవద్దని కేటీఆర్‌కి వార్నింగ్ ఇచ్చారు.

కేటీఆర్‌కు డబ్బులు ఎక్కువైతే కాంగ్రెస్, కోదండరాంతో పెట్టుకోవాలంతే కానీ ప్రపంచాన్ని జయించిన పాల్‌తో పెట్టుకోవద్దని హెచ్చరించారు. సిగ్గులేని ఎమ్మెల్యేలు మాత్రమే టీఆర్ఎస్‌లో చేరుతున్నారని అన్నారు.

చదవండి: చెబితే వినరేంటి?: కేఏ పాల్ రేంజ్ ఏమిటో తెలుసా?

కేసీఆర్‌ని ఆశీర్వదించాను…

2008లో కేసీఆర్ తన దగ్గరకు వస్తే ఆశీర్వదించానని, మెదట తెలంగాణకు మద్దతు ఇచ్చి కేసీఆర్‌కు ఫండింగ్ కూడా చేశానని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేటీఆర్‌కు పిచ్చి పట్టిందని, కేటీఆర్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, కేటీఆర్‌కు డబ్బు, అహంకారం ఎక్కువైందని అన్నారు.

ఇక తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరమని, కవిత, కేటీఆర్ ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ నిద్రపోతారా? అని ప్రశ్నించారు.  కేసీఆర్ చినజీయర్ స్వామి కాళ్ళు పట్టుకున్నా ఆయన కూడా కాపాడలేడని, తాను శాపం పెడితే నాశనం‌ అయిపోతారని చెప్పుకొచ్చారు.

అయితే తనతో గొడవలొద్దని, కేసీఆర్, కేటీఆర్ శాంతిమార్గంలో తనతో కలసిరావాలని పిలుపునిచ్చారు. అలాగే అమెరికా అధ్యక్షుడిని హైదరాబాద్ తీసుకొచ్చి తెలంగాణను అభివృద్ధి చేద్దామని, తనకు ఒక్క లెటర్ ఇవ్వండి అమెరికా ప్రెసిడెంట్‌ను హైదరాబాద్ తీసుకొస్తానని చెప్పుకొచ్చారు.

చదవండికేసీఆర్‌కు నేనంటే భయం: పవన్ కళ్యాణ్‌పై కేఏ పాల్ తీవ్ర వ్యాఖ్యలు
- Advertisement -