

సంగారెడ్డి: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నేత, కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు గతంలో కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నించారంటూ బాంబు పేల్చారు. సోమవారం జగ్గారెడ్డి హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కుటుంబంతో తనకెలాంటి శత్రుత్వం లేదన్న ఆయన, హరీష్ రావుతో మాత్రమే కొన్ని విభేదాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
కేవీపీ ద్వారా హరీశ్ మంతనాలు..
టీఆర్ఎస్ నేత హరీశ్‌రావు 2008లోనే కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నించారని, దీనికి సంబంధించి అప్పట్లో ఆయన కేవీపీ ద్వారా మంతనాలు సాగించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో కేసీఆర్, కేటీఆర్ ఆకట్టుకొనే కామెంట్స్ కూడా చేశారు జగ్గారెడ్డి. హరీశ్ రావు కంటే కేటీఆర్ చాలా ఫెయిర్‌గా ఉంటారని, కేసీఆర్ వల్లే తాను తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించానని చెప్పుకొచ్చారు.
బీజేపీలో తనను అణగదొక్కేందుకు ప్రయత్నాలు జరిగిన సమయంలో కేసీఆర్ పిలిచి తనకు టిక్కెట్టు ఇచ్చారని జగ్గారెడ్డి తెలిపారు. మొత్తానికి.. హరీశ్ రావు ఇమేజ్‌ని డ్యామేజ్ చేసే విధంగా జగ్గారెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. ఐతే, దీని వెనక ఎవరన్నా ఉన్నారా.. ? అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.
హరీశ్ రావుని తెరాస నుంచి పొమ్మనలేక పొగబెట్టే ప్రయత్నాలేవో మొదలైనట్లు ఉన్నాయి. చూడాలి మరి ఇది ఏ విధంగా టర్న్ తీసుకుంటుందో..
చదవండి: బ్లాక్‌మెయిలర్ హరీశ్! నిజాయితీ గల నేత కేటీఆర్: జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు








