23.7 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ షాకింగ్: ఆ జాబితాలో హరీశ్ రావుకు దక్కని చోటు

షాకింగ్: ఆ జాబితాలో హరీశ్ రావుకు దక్కని చోటు

Harish Rao missing as TRS Latest News, Harish Rao Latest News, Telangana Political News, Newsxpressonline
- Advertisement -

హైదరాబాద్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి హరీశ్ రావు.. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ప్రచారం చేసే లేనట్లే కనిపిస్తోంది. తాజాగా 20మందితో కూడిన లోక్‌సభ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ల జాబితాను టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి పంపింది.

ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర కేబినెట్‌లోని 11మంది మంత్రులు, సెక్రటరీ జనరల్ కే కేశవరావు, ఐదుగురు ప్రధాన కార్యదర్శులు జే సంతోష్ కుమార్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డి, బండా ప్రకాశ్, టీ రవీందర్ రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పేర్లను ఎన్నికల సంఘానికి పంపింది.

జాబితాలో హరీశ్ రావుకు దక్కని చోటు

అయితే, ఈ జాబితాలో హరీశ్ రావు పేరు లేకపోవడం గమనార్హం. దీంతో ఆయన ఈ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం నిర్వహించలేరు. కాగా, హరీశ్ రావుపై కుట్ర జరుగుతోందంటూ ఇప్పటికే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉండగా, మజ్లిస్ పార్టీ నుంచి స్టార్ క్యాంపెయినర్లుగా లోక్‌సభకు పోటీ చేస్తున్న పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీలు మాత్రమే ఉన్నారు. కాగా, బీఎస్పీ నుంచి 40మంది జాబితాను ఎన్నికల సంఘం ఆమోదించింది.

ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పార్టీ సమన్వయ కర్తలు వీర్ సింగ్, గౌరి ప్రసాద్ ఉపాసక్, తెలంగాణ రాష్ట్ర సమన్వయ కర్తలు సిద్ధార్థపూలే, దేవళ్ల గంగాధర్‌లతోపాటు మరో 35మందిని ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్లుగా నియమించింది.

 

- Advertisement -