
హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. నేడు కొత్తగా 1,567 మంది కరోనా మహమ్మారి బారినపడ్డారు. అలాగే, 9 మంది మృతి చెందారు.
తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా కరోనా బారినపడి వారి సంఖ్య 50,826కు పెరిగింది. అలాగే, కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 447కు పెరిగింది.
కరోనా నుంచి తాజాగా 1,661 కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 39,327కు పెరిగింది. రాష్ట్రంలో ఇంకా 11,052 యాక్టివ్‌గా ఉన్నాయి.
నేడు నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 662 కేసులు వెలుగు చూడగా, ఆ తర్వాత అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 213, వరంగల్ అర్బన్‌లో 75, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 62, మహబూబ్‌నగర్‌లో 61, నాగర్ కర్నూలులో 51 కేసులు నమోదయ్యాయి.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated. 23.07.2020)#TelanganaFightsCorona #StayHome #StaySafe pic.twitter.com/9OXJaLFTlo
— Eatala Rajender (@Eatala_Rajender) July 23, 2020








