గద్వాల: టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఐదేళ్లు అధికారం కట్టబెడితే నాలుగేళ్ళకే పారిపోయిన ముందస్తు ఎన్నికలు పెట్టిన ఘనత కేసీఆర్‌దన్నారు టీ-కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి. ఎన్నోఉద్యమాలు చేసి ఎన్నోఅవమానాలు పడి సాధించుకున్న తెలంగాణ ఇప్పుడు దొరపాలయ్యిందన్నారు. గద్వాల జోగులాంబకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల శంఖారావాన్ని పూరించిన తర్వాత విజయశాంతి. కేసీఆర్, టీఆర్ఎస్ టార్గెట్‌గా నిప్పులు చేరిగారు. ముందస్తు ఎన్నికలకు కారణాలను చెప్పని కేసీఆర్… తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాడానికే ముందస్తు ఎన్నికలకు వెళ్ళారన్నారు. సినిమాలో రాములమ్మ ఎన్ని కష్టాలు పడిందో… తెలంగాణలో ప్రజలు అవే కష్టాలు పడుతున్నారు అని విజయశాంతి అన్నారు..
తనను చెల్లిలిగా భావించి కడుపులో పెట్టుకు చూసుకుంటానన్న కేసీఆర్ తనను పార్టీ నుంచి ఎందుకు సస్పెడ్ చేశారని ప్రశ్నించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నవి సంక్షేమ ఫథకాలు కావని… తమ పార్టీ సంపాదన పథకలని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబం కోసమే తెలంగాణ వచ్చినట్లయిందని… ఇప్పటికైనా ప్రజలు మేల్కోవలన్నారు. తెలంగాణ వస్తే అందరికీ మంచి జరుగుతుందని… ఎన్నో వాగ్దానాలు ఇచ్చిన కేసీఆర్‌ను నమ్మి ప్రజలు అధికారం కట్టబెట్టారన్ని. ఇచ్చిన హామీలు అమలు చేస్తారనే ఈ నాలుగేళ్లు తానేమీ మాట్లాడలేదన్నారు. కాని ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయారని విమర్శిచారు.
చిన్న ఇల్లుకు ఆశపడి తెలంగాణను దొరలకు కట్టబెట్టామని, రైతు బంధు పథకం రైతు మరణ బంధు అవుతుందని విమర్శి చారు విజయశాంతి…. టీఆర్‌ఎస్ పాలనకు చమరగీతం పాడి కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. తెలంగాణలో యువతకు న్యాయం జరుగుతుందనుకున్నామని… కానీ మళ్ళీ ఆంధ్రా పాలనే కనిపిస్తోంది. ఆ బాసిన బతుకుల నుంచి విముక్తి పొందాలంటే కాంగ్రెసును గెలిపించాలన్నారు. టీఆర్ఎస్ డబ్బు ఇస్తే అవి తీసుకుని కాంగ్రెస్కు ఓటు వేయాలని ప్రజలను కోరారు.