

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎంపికపై ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు ముగిసినట్టే కనిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా పోచారం శ్రీనివాసరెడ్డి పేరు దాదాపుగా ఖరారైందని సమాచారం. స్పీకర్ పోస్ట్‌కు కొందరు ఎమ్మెల్యేలు ఉత్సాహం చూపినప్పటికీ సీనియర్ ఎమ్మెల్యే కావడంతో పోచారం శ్రీనివాస్‌రెడ్డి వైపే కేసీఆర్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
రేపటి నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేసీఆర్ పోచారం పేరును ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. రేపు ఉదయం 11.30గంటలకు ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు. స్పీకర్ ఎన్నికకు షెడ్యూల్ ప్రకటన కూడా రేపే వెల్లడించే అవకాశం ఉంది.
18న స్పీకర్‌గా ఎన్నికైన అభ్యర్థిని ప్రకటిస్తారు. అనంతరం కొత్తగా ఎన్నికైన స్పీకర్ అధ్యక్షతన సమావేశాలు జరగనున్నాయి.








