27.8 C
Hyderabad
Sunday, October 11, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ సుజనా చౌదరిని వదలని సీబీఐ! మరోసారి నోటీసులు!

సుజనా చౌదరిని వదలని సీబీఐ! మరోసారి నోటీసులు!

- Advertisement -

అమరావతి: కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మరోసారి నోటీసులు పంపింది. మే4న బెంళూరులోని సీబీఐ కార్యాలయానికి విచారణ కోసం హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఐతే సీబీఐ నోటీసులను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు సుజనా చౌదరి. బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీతో తనకు సంబంధంలేదని ఆయన పేర్కొన్నారు.

తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే సీబీఐ నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. కాగా, ఏప్రిల్ 25న కూడా సుజనా చౌదరికి సీబీఐ నోటీసులు పంపించారు. బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీ వ్యవహారంలో బ్యాంకులకు కోట్ల రూపాయల నష్టం చేకూర్చినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. 2017లో ఆంధ్రా బ్యాంకును రూ.71 కోట్ల మేర మోసం చేసినట్లు బెంగళూరు బ్రాంచ్‌లో సుజనా చౌదరిపై కేసు నమోదయింది.

దానికి సంబంధించి విచారణకు హాజరవ్వాల్సిందిగా సీబీఐ అధికారులు సమన్లు జారీచేశారు. సీబీఐ సమన్లపై గతంలోనే స్పందించిన సుజనా చౌదరి.. బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీతో తనకు సంబంధం లేదని స్పష్టంచేశారు.

2003 నుంచి 2014 వరకు సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్, స్ప్లెండింగ్ మెటల్ ప్రాడక్ట్స్, నియాన్ టవర్స్ కంపెనీల్లో నాన్ ఎగ్జిక్యూటివ్‌లో ఉన్నానని తెలిపారు. 2014 నుంచి ఏ కంపెనీలోనూ ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో లేని స్పష్టంచేశారు. ఐతే ఇప్పుడు మరోసారి నోటీసులు పంపించడంతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు సుజనా చౌదరి.

చదవండి:   నిజామాబాద్, ఏపీ రైతులకు చుక్కలు చూపిస్తున్న యూపీ ఇంటెలిజెన్స్
- Advertisement -