30.2 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు: కొండా రాజీనామా

ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు: కొండా రాజీనామా

mlc
- Advertisement -

హైదరాబాద్‌: తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది. ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీలు భూపతిరెడ్డి, రాములు నాయక్‌, యాదవరెడ్డిని అనర్హులుగా ప్రకటిస్తూ మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు.

నిజామాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి భూపతిరెడ్డి, శాసనసభ్యుల కోటాలో యాదవరెడ్డి, గవర్నర్‌ కోటాలో రాములు నాయక్‌ మండలి సభ్యులయ్యారు. అయితే, టీఆర్ఎస్ సభ్యులుగా ఎన్నికైన ఈముగ్గురూ కాంగ్రెస్‌ పార్టీలో చేరి.. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించారని టీఆర్ఎస్ శాసనమండలి పక్షం ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. ముగ్గరు అనర్హులుగా ప్రకటించాలని కోరింది.

ఇరువైపులా వాదనలు విన్న ఛైర్మన్…

ఈ నేపథ్యంలో శాసనమండలి ఛైర్మన్‌ ఇటీవల ఇరువైపులా వాదనలు విన్నారు. తమ పార్టీ నుంచి గెలిచి చట్ట విరుద్ధంగా పార్టీ మారారని వాదించిన టీఆర్ఎస్.. ఇందుకు సంబంధించిన ఆధారాలను మండలి ఛైర్మన్‌కు సమర్పించింది.

జనవరి 19న ఉభయ సభలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మండలి ఛైర్మన్‌ వీరిపై చర్యలు చేపట్టారు. భూపతిరెడ్డి, రాములు నాయక్‌, యాదవరెడ్డిపై అనర్హత వేటు వేస్తూ తుది నిర్ణయాన్ని వెల్లడించారు. కాగా, ఇటీవల టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్సీ కొండా మురళి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీల వేటు విషయంలో తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కాంగ్రెస్ పేర్కొంది.

- Advertisement -