22.7 C
Hyderabad
Tuesday, October 13, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ నిందితులను వదిలిపెట్టం: వివేకా హత్యపై చంద్రబాబు కీలక ప్రశ్నలు

నిందితులను వదిలిపెట్టం: వివేకా హత్యపై చంద్రబాబు కీలక ప్రశ్నలు

Will catch the culprits in YS Vivekananda Reddy murder case: CM Chandrababu Naidu, Newsxpressonline
- Advertisement -

అమరావతి: వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యకేసులో వాస్తవాలన్నీ బహిర్గతం చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పార్టీ నేతలతో శనివారం ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ రోజు తిరుపతి నుంచే తెలుగుదేశం విజయ శంఖారావం పూరించనున్నట్లు తెలిపారు. దైవ దర్శనం తరువాత శ్రీకాకుళం నుంచి ప్రజల్లోకి వెళ్తున్నట్లు చెప్పారు. 5 ఏళ్ల మన అభివృద్ధి, సంక్షేమం దేశానికే నమూనాగా చెప్పుకొచ్చారు.

తెలుగుదేశానికి ఉన్న ప్రజాదరణ చూసి వైసీపీ నేతలకు కంటగింపు కలిగిందన్నారు. ఆ అక్కసుతోనే టీడీపీపై నిందలు వేస్తున్నారన్నారు. వివేకానంద రెడ్డి హత్యను రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వివేకా హత్య వాళ్ల ఊళ్లో, వాళ్ల ఇంట్లో జరిగిందని చంద్రబాబు చెప్పారు. ఈ హత్యపై టీడీపీని నిందించడం అమానుషమని వ్యాఖ్యానించారు.

వివేకా హత్య కేసులో వాస్తవాలను బయటికి తెస్తామని అన్నారు. తప్పులు చేసి తప్పించుకోవడం జగన్‌కు అలవాటేనని చంద్రబాబు విమర్శించారు. రాజకీయ లాభాల కోసమే కోడికత్తి కేసు తెచ్చారని, ఎన్నికల కోసమే షర్మిలతో పాత కేసులు మళ్లీ పెట్టించారని ఆరోపించారు. నీతిమాలిన రాజకీయాల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని కార్యకర్తలను కోరారు. టీడీపీని ఇబ్బంది పెట్టేందుకే బీజేపీ, వైసీపీలు కుట్రలు పన్నాయన్నారు.

ఇవన్నీ ఎందుకు చేశారు?: చంద్రబాబు ప్రశ్నల వర్షం

వివేకా హత్యపై రాజకీయం చేస్తున్నారని ఆరోపించిన చంద్రబాబు.. ఈ కేసు విషయంలో పలు ప్రశ్నలు సంధించారు. ఘటన జరిగిన ఉదయం 05.30 గంటలకు పీఏ వెళ్తే.. ఉదయం 06.40 గంటలకు అవినాష్ రెడ్డి పోలీసులకు ఫోన్ చేశారు. చనిపోయారని చెప్పారే తప్ప.. వేరే విధంగా చెప్పలేదన్నారు. మరోవైపు సంఘటనా స్థలంలో ఆధారాలు దొరకకుండా అంతా సరిచేశారని చంద్రబాబు ఆరోపించారు.

బాత్‌రూమ్‌లో చనిపోయిన వివేకాను బెడ్‌రూమ్‌లోకి ఎందుకు తెచ్చారు? రక్తపు మరకలు ఎందుకు తుడిచేశారు? ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత కూడా గుండెపోటు అనే ఎందుకు చెప్పారు? ఇంతగా చేయాల్సిన అవసరం ఏముంది..? ఎవర్ని షీల్డ్ చేయడానికి చేశారు ఇదంతా? ఆస్పత్రికి మృతదేహాన్ని తీసుకెళ్లేంత వరకు ఎందుకు హైడ్ చేశారు? అంటూ చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు.

వివేకా డెడ్ బాడీ పడిన తీరు చూస్తుంటేనే మర్డర్ అని స్పష్టంగా తెలిసిపోతోంది.. కానీ, ఎందుకు గుండెపోటు అని చెబుతూ వచ్చారని ప్రశ్నించారు. ఇక ఆ తర్వాత రకరకాలుగా ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేతలపై మండిపడ్డారు చంద్రబాబు. ‘నా మీద, లోకేష్ మీద, పార్టీ మీద అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వివేకాకు గుండెపోటు వచ్చిందని కేసు కూడా అవసరం లేదని కూడా చెప్పారని ఆరోపించారు చంద్రబాబు.. కేసు కూడా అవసరం లేదని.. ఎందుకు చెప్పాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదని జగన్‌ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు మండిపడ్డారు.

‘ఆస్తులు సంపాదించుకోవచ్చు. భూములు సంపాదించుకోవచ్చు. శాంతిభద్రతలను రక్షించేది పోలీసు వ్యవస్థే. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా పనిచేస్తుంది. పోలీస్‌ వ్యవస్థపై నమ్మకం లేదంటే ప్రైవేటు ఆర్మీ పెట్టుకుంటారా? నమ్మకం లేదంటే ఏం చేస్తాం.. నేను వ్యవస్థల్ని గౌరవించను..చట్టాలను గౌరవించను అంటే కుదరదు’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వివేకా హత్యోదంతంలో ఓ లేఖ దొరికినట్లుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ‘నా డ్రైవర్‌ను డ్యూటీకి తొందరగా రమ్మన్నానని చచ్చేలా కొట్టినాడు. ఈ లెటర్‌ రాసేందుకు చాలా కష్టపడ్డాను. డ్రైవర్‌ ప్రసాద్‌ను వదిలిపెట్టొద్దు.. – ఇట్లు వివేకానందరెడ్డి’ అని లేఖలో ఉంది. ఆ లేఖలోని అంశాలు ఎవరు రాశారు, డ్రైవర్‌ పేరు ఎందుకొచ్చింది? దాని వెనక ఎవరున్నారు తదితర అంశాలపై విచారణ జరుగుతోందని చంద్రబాబు చెప్పారు.

 

- Advertisement -