23.7 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ వైసీపీని విభేదించిన వివేకా! జగన్‌కి, వివేకానందరెడ్డికి మధ్య చివరిమాటలు!

వైసీపీని విభేదించిన వివేకా! జగన్‌కి, వివేకానందరెడ్డికి మధ్య చివరిమాటలు!

Viveka disagree with the YCP Ends between Jagan and Vivekananda Reddy, Newsxpressonline
- Advertisement -

కడప: వైఎస్ వివేకానంద రెడ్డి గత 30 సంవత్సరాలుగా ఎటువంటి ఆరోపణలు లేకుండా, రాజకీయం పట్ల ఎంతో నిబద్దతతో , అలాగే ప్రజలకి సేవ చేయాలనే తపనతో సుదీర్ఘంగా రాజకీయాలలో కొనసాగాడు. అలాగే ఫ్యాక్షన్ కి మారుపేరైన కడప జిల్లా కీలక నేతగా ఉంటూ కూడా ఎంతో సౌమ్యుడిగా పేరుతెచ్చుకున్నారు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు అయన స్వభావం ఏమిటో.

కానీ , నేడు ఆయనని అతి దారుణంగా గొడ్డలితో నరికి చంపేశారు. దీనితో మళ్ళీ కడప గడపలో కక్ష పూరిత రాజకీయాలు నివురుగప్పుతున్నాయా , పాత పగలు తెరపైకి వచ్చి రక్త చరిత్ర రాస్తున్నాయా అని అనిపించకమానదు.

ఆ తరువాత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం వై ఎస్ కుటుంబ సభ్యులతో పాటుగా , రాష్ట్ర ప్రజలందరినీ షాక్ కి గురిచేసింది.వైఎస్ మరణం తర్వాత మాత్రమే వివేకానందరెడ్డి ఆయన అభిమానించిన కాంగ్రెస్ పార్టీలొ కొనసాగి మంత్రి పదవి తీసుకున్నారు. ఆ సమయంలో బాబాయ్ వివేకా , కుమారుడు జగన్ తో వివేకా విభేదించడం జిల్లాలో పెద్ద చర్చనీయాంశంగ మారింది. వైసీపీలోకి వెళ్లకుండా కాంగ్రెస్ లో కొనసాగిన వివేకాను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఇబ్బంది పెట్టింది.

కడప నేను చూసుకుంటా ….మిగిలిన జిల్లాలపై దృష్టి పెట్టు…

వ్యవసాయమంత్రిగా ఉన్న వివేకాను అడ్డుపెట్టుకుని నిండు అసెంబ్లీలో వైఎస్ పై తన సహచర మంత్రులు తీవ్ర విమర్శలు చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వివేకా మంత్రి పదవి కూడా వదులుకున్నారు. జగన్ తో వివేకానందరెడ్డి విభేదించడంపై అప్పట్లో కుటుంబ సభ్యులతోపాటు జిల్లాలోని వైఎస్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా… తాను నమ్మిన సిద్ధాంతాల కోసం కాంగ్రెస్ ను వీడలేదు.

చివరికి జగన్ ను అడ్డుకునే ఉద్దేశంతో వైఎస్ ను తమ వాడంటూనే కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆయనపై విమర్శలు చేయడాన్ని సహించలేకపోయిన వివేకానందరెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. అప్పటినుంచీ తుదిశ్వాస విడిచే వరకూ ఆయన వైసీపీలోనే కొనసాగారు.

ఇక ప్రస్తుతం ఏపీలో అన్నిపార్టీలు కూడా ఎన్నికలలో నిలబెట్టే అభ్యర్థులపై తర్జనభర్జనలు పడుతున్నాయి. ఈ విషయం లో బాబాయ్ వివేకానంద రెడ్డి హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ కి తోడుగా ఉంటూ , అసమ్మతినేతలని బుజ్జగిస్తూ చాలా చురుగ్గా పాల్గొన్నాడు. కడప సంగతి నాకు వదిలేయ్ , మిగిలిన జిల్లాల ప్రచారం ఆపై దృష్టి పెట్టు అని చెప్పినట్టు సమాచారం.

- Advertisement -