24.9 C
Hyderabad
Sunday, October 11, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ సాక్షి దినపత్రిక, వైఎస్ జగన్‌పై ఎన్నికల సంఘానికి దివ్యవాణి ఫిర్యాదు!

సాక్షి దినపత్రిక, వైఎస్ జగన్‌పై ఎన్నికల సంఘానికి దివ్యవాణి ఫిర్యాదు!

Complaint against Sakshi Daily, Complaint against YS Jagan
- Advertisement -

అమరావతి: సాక్షి దినపత్రిక, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిలపై టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌ ఆనందసూర్య ఏపీ ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ గోపాల్ కృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేశారు.

రిటైర్డ్‌ చీఫ్ సెక్రెటరీ అజయ్‌కల్లాంతో సాక్షి పత్రికలో ఆర్టికల్‌ రాయించుకుని టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు రూ.60 లక్షల టారిఫ్ అయ్యే ఇంటర్వ్యూ వైఎస్ జగన్ రాయించుకున్నారని ఆరోపించారు.
అంతేకాకుండా, సాక్షి పత్రికను పార్కులు, వీధుల్లో ఉచితంగా ఇస్తున్నారని దివ్యవాణి పేర్కొన్నారు. ఆ రూ. 60 లక్షలను ఎన్నికల ఖర్చు కింద వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ ఖాతాలోనే రాయలంటూ తాము ఎన్నికల కమిషనర్‌ ద్వివేదిని కోరినట్లు దివ్యవాణి మీడియాకు తెలిపారు.

 

- Advertisement -