22.4 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ విశాఖ గ్యాస్ లీకేజి దుర్ఘటన: స్పందించిన ప్రధాని మోడీ, సీఎం జగన్‌కు ఫోన్…

విశాఖ గ్యాస్ లీకేజి దుర్ఘటన: స్పందించిన ప్రధాని మోడీ, సీఎం జగన్‌కు ఫోన్…

pm modi phone call to ap cm ys jagan on vizag chemical gas leakage incident
- Advertisement -

అమరావతి: విశాఖ నగరం సమీపంలోని ఆర్ ఆర్ వెంకటాపురంలో గురువారం ఉదయం రసాయన వాయువు లీకేజి దుర్ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. 

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఫోన్ చేసి దుర్ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయితే పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు జగన్ ఆయనకు చెప్పారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను, బాధితులకు అందుతోన్న వైద్యానికి సంబంధించి వివరాలను ప్రధానికి వివరించారు. 

విశాఖలో గ్యాస్ లీకేజి దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ ఒక ట్వీట్ కూడా చేశారు. ఘటనకు సంబంధించి ప్రస్తుత పరిస్థితిపై హోంశాఖ, విపత్తు నిర్వహణ విభాగం అధికారులతో మాట్లాడినట్లు ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందుతుందని ఆశిస్తున్నానని, విశాఖలోని ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని తాను దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. 

చదవండి: విశాఖలో ఎల్జీ పాలిమర్స్ నుంచి కెమికల్ గ్యాస్ లీక్.. ముగ్గురి మృతి.. వందలాదిమందికి అస్వస్థత
చదవండి: విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో 8కి పెరిగిన మృతుల సంఖ్య.. మరికాసేపట్లో విశాఖకు జగన్
చదవండి: విశాఖ గ్యాస్ లీక్ ఘటన: సీఎం జగన్ తీవ్ర ఆవేదన, సహాయక చర్యల వేగవంతానికి ఉన్నతాధికారులకు ఆదేశాలు…
చదవండి: విశాఖ గ్యాస్ లీకేజి: చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి.. విశాఖ వెళ్లేందుకు అనుమతి కోసం కేంద్రానికి విజ్ఞప్తి…
- Advertisement -