28.3 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ లోటస్ పాండ్ టు అమరావతి.. జగన్ మకాం మార్చడానికి అసలు కారణం ఇదే!

లోటస్ పాండ్ టు అమరావతి.. జగన్ మకాం మార్చడానికి అసలు కారణం ఇదే!

Chandrababu Naidu Varthalu, YS Jagan Updates, AP Political Latest News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబు కంటే జగన్ తమ పార్టీ విజయం సాధిస్తుంది అన్న ధీమాలో ఉన్నట్టు కనిపిస్తుంది. చంద్రబాబు ఇంకా గెలుపుపై సందిగ్ధంలో ఉన్నట్టు ఆయన మాటలతోనే అర్ధం అవుతుంది. తమ పార్టీ ఘన విజయం సాధిస్తుందనే ధీమాతో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది .

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముహూర్తాన్ని కూడా ఆయన ఖరారు చేసుకున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. అంతేకాదు, జగన్ పార్టీకి సంబంధించి క్యాబినెట్‌పై కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చే జరుగుతుంది.

దీనికి తోడు జగన్ తన మకాం కూడా  లోటస్ పాండ్ నుండి మారుస్తున్నారు. నిన్న మొన్నటి వరకు హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌ నివాసంలో ఉన్న జగన్ ఇక తన మకాంను పూర్తిగా ఏపీ రాజధాని అమరావతికి మారుస్తున్నారు. అక్కడి ఉండవల్లిలోని తన నివాసానికి ఈ నెల 22వ తేదీన ఆయన తన మకాంను మార్చబోతున్నారు.

అధికారం తమదే అన్న ధీమాతో…

దీనికంటే ముందే వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయాన్ని కూడా అమరావతికి తరలిస్తున్నారు. ఈ నెల 21వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో పార్టీ కార్యాలయం అమరావతి నుంచి పనిచేయడం ప్రారంభిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.  తమ పార్టీ అధికారంలోకి వస్తుందనే ధీమాతోనే జగన్ ఈ కార్యక్రమాలన్నీ  చేస్తున్నారని అంటున్నారు. 

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని చాలా స్ట్రాంగ్‌గా నమ్ముతున్నారు జగన్. జగన్ ప్రమాణ స్వీకారానికి స్వరూపానందేంద్ర స్వామి సైతం ముహూర్తం నిర్ణయించడం, అలాగే ఇప్పటికే పలు జాతీయ సర్వేలు సైతం ఈసారి విజయం వైసీపీదే అని తేల్చేశాయి.

చదవండి:  తన గెలుపుపై పక్కా లెక్కలు చెబుతున్న టీడీపీ సీనియర్ నేత…

వీటన్నింటికీ తోడు తాను నియమించుకున్న పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ (పీకే) సర్వేలో సైతం వైసీపీయే విజయం సాధిస్తుంది అని చెప్పటంతో జగన్ మంచి జోష్‌లో ఉన్నారు. మరోవైపు వైసిపీ గెలిస్తే జగన్ ఈ నెల 26వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారనే ప్రచారం కూడా జోరుగానే సాగుతూ వస్తోంది.

వాస్తవానికి వైఎస్ జగన్ ఈ నెల 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం ఖరారైందని అంటున్నారు. విశాఖకు చెందిన శ్రీ స్వరూపానందేంద్ర స్వామి ఈ ముహూర్తం పెట్టినట్లు తెలుస్తోంది. స్వరూపానందేంద్ర స్వామి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడనే విషయం అందరికీ తెలిసిందే. ఆయనే ఈ ముహూర్తం నిర్ణయించారని తెలుస్తుంది.

జగన్ క్యాబినెట్ పై రాష్ట్ర వ్యాప్త చర్చ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి తమదే అధికారం అంటూ ధీమాగా ఉంది. తామే కింగ్ అంటూ చెప్పుకుంటోంది. ఈసారి ఎన్నికల ఫలితాలు తమకే అనుకూలంగా ఉన్నాయంటూ గట్టిగా నమ్ముతోంది వైసీపీ. అంతేకాదు వైసీపీలో కీలక నేతలు తమకు మంత్రి పదవులు వస్తాయంటూ ప్రచారం కూడా చేసేసుకుంటున్నారు.

కొందరు అభిమానులైతే కాబోయే మంత్రి, కాబోయే ఎమ్మెల్యే అంటూ స్టిక్కర్లు ఫ్లెక్సీలు వేసుకుని మరీ హల్ చల్ చేస్తున్నారు. జగన్ పార్టీలో ఉన్న జోష్ , టీడీపీలో కనిపించటం లేదు. జగన్ పార్టీ ఆఫీసు, మకాం పూర్తిగా అమరావతికి మార్చటం , పార్టీ శ్రేణుల్లో నెలకొన్న ఉత్సాహం , జగన్ కాన్ఫిడెన్స్ వెరసి జగన్ పార్టీ విజయం సాధిస్తుంది అన్న ధీమా వైసీపీలో కనిపిస్తుంది.

చదవండి:  ఏపీలో అందరి దృష్టి ‘నగరి’పైనే..! మరి రోజా గెలుపు ఖాయమేనా?

- Advertisement -