
ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ జగన్‌కి క్లియర్ ఎడ్జ్ ఉంది. చంద్రబాబుకు గెలిచే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది. ఈ విషయం చంద్రబాబుకి కూడా తెలుసు.
అయితే పోల్ మేనేజ్‌మెంట్‌లో కింగ్ అయిన చంద్రబాబు మాత్రం చివరి వరకూ పట్టు విడవకూడదని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యాడు. ఇప్పుడు చివరి బ్రహ్మాస్త్రంగా ఒక వ్యూహం రచించారని విశ్లేషకులు చెబుతున్నారు.
మోడీతో కుమ్మక్కు, కేసీఆర్‌తో కుమ్మక్కులాంటి అస్త్రాలన్నీ పెద్దగా వర్కవుట్ అవ్వలేదట. జగన్ లక్ష కోట్లు తిన్నాడు అని చెప్పినా.. కేసీఆర్ దగ్గర వెయ్యి కోట్లకు సాగిలపడ్డాడు అని ఆరోపణలు చేసినా..అవి టీడీపీ నేతలకే కామెడీగా అనిపిస్తున్నాయి. అయితే ఈ చివరి బ్రహ్మాస్త్రం మాత్రం వర్కవుట్ అవుతుందని టీడీపీ తమ్ముళ్లు చాలా నమ్మకంతో ఉన్నారట.
ఇదైనా ఫలిస్తుందా..?
పొలిటికల్ విశ్లేషకుడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై పూర్తి అవగాహన ఒకాయన.. ఆ బ్రహ్మాస్త్రం గురించి సవివరంగా చెప్పుకొచ్చారు. అయితే వైఎస్ జగన్‌తోపాటుగా వైఎస్సార్సీపీ ఇతర నాయకులు, కార్యకర్తలు టీడీపీ ప్రయోగించనున్న ఈ చివరి అస్త్రాన్ని ఎలా ఫేస్ చేస్తారు? అసలు బ్రహ్మాస్త్రంగా పేర్కొంటున్న ఈ చివరి అస్త్రం వర్కవుట్ అవుతుందా? ఇవన్నీ ప్రశ్నలు.
ఇప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకుంటున్న చంద్రబాబు ఫైనల్‌గా ఈ అస్త్రాన్ని ఎలా ప్రయోగిస్తారు? నెగిటివ్ అవుతుందని భయపడతారా? ఒకవేళ చంద్రబాబు ఈ బ్రహ్మస్త్రం ప్రయోగిస్తే.. జగన్ ఎదుర్కోగలడా? అనే విషయాలపై స్పష్టత లేదుగానీ చంద్రబాబు వ్యూహంపై మాత్రం చాలానే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబు వ్యూహం గురించి వస్తున్న సమాచారం ఏమిటంటే..
ఏప్రిల్ 8వ తేదీ సాయంత్రం 4 గంటలు… ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా తిరిగిన చంద్రబాబు, ఓ సభా వేదికపై మాట్లాడుతూ తూలి పడిపోతారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరిలోనూ ఆందోళన మొదలవుతుంది.
ఒక వేళ సీన్ మారితే.. ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 9 గంటలు, ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన చంద్రబాబు.. నడుస్తూ.. నడుస్తూ కింద పడిపోతారు.
ఎన్నికల ప్రచారంలో అలసిపోయిన చంద్రబాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారనే వార్త బయటికొస్తుంది. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరిలోనూ తీవ్ర ఆందోళన మొదలవుతుంది. పక్కనే ఉన్న అంబులెన్స్‌లో ఓ పెద్ద కార్పొరేట్ ఆస్పత్రికి చంద్రబాబును తీసుకెళ్లిపోతారు.
లోపల ఏం జరుగుతుందో చీమకు కూడా తెలియదు. కానీ లోపలి నుంచి లీకేజీ మెసేజ్‌లు వస్తాయి. సన్ స్ట్రోక్ తగిలింది.. చంద్రబాబు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ట్రీట్‌మెంట్ ఇస్తున్నారని.. అక్కడ నుంచి ఎన్నికల ప్రణాళిక స్కెచ్ గీస్తుంటారు.
ఈలోగా మీడియా ఎడతెగని స్క్రోలింగ్‌లతో క్షణం క్షణం చెవులు తూట్లు పడేలా అప్‌డేట్స్ ఇస్తూ పోతుంది. ఇదంతా ఎలక‌్షన్‌కు ముందు రాష్ట్ర ప్రజల అటెన్షన్‌ను డైవర్ట్ చేసి లబ్ధి పొందాలనే కుట్ర. చూడాలి మరి ఏం జరుగుతుందో.. చంద్రబాబు చివరి బ్రహ్మాస్త్రం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో…









2003 lo kuda alopiri blast cheyinchukunadu yemaindi? Ade jarugutundi
Andhra Pradesh people are not free to accept the FLOWES from TDP, a hollow borrowed political party robbed from Sn.NTR & with force….????????????