27.6 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఒక్కసారే కదా అని విషం తాగుతామా?: జగన్, కేసీఆర్‌లపై చంద్రబాబు ఫైర్

ఒక్కసారే కదా అని విషం తాగుతామా?: జగన్, కేసీఆర్‌లపై చంద్రబాబు ఫైర్

Chandrababu Fair News, YS Jagan Latest News, KCR News, Newsxpressonlone
- Advertisement -

అమరావతి: తెలంగాణ సీఎం కేసీఆర్ బెదిరింపుల వల్లే సినీనటులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు క్యూ కడుతున్నారని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆస్తులు కాపాడుకోవడం కోసమే వైసీపీ కండువాలు కప్పుకుంటున్నారని విమర్శించారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తమకూ ఇవ్వాలన్న కేసీఆర్‌తో కలిసి ఏపీకి జగన్ హోదా తెస్తాడా? అని చంద్రబాబు ప్రశ్నించారు. పోలవరంపై పదే పదే కేసులేసే కేసీఆర్‌కు జగన్ మద్దతు ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు. కేసుల కోసం మోడీతో, ఆస్తుల కోసం కేసీఆర్‌తో జగన్ లాలూచీపడ్డారని చంద్రబాబు ఆరోపించారు.

ఒక్కసారి అవకాశమిస్తే..

ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ వైసీపీ నేతలు మొసలి కన్నీరుకారుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒక్కసారే కదా అని తినే తిండిలో విషం కలుపుకోం కదా.. కొండపైకెక్కి లోయలో దూకం కదా అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. మంగళవారం పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పసుపు-కుంకుమ డబ్బులు ఆపాలని వైసీపీ నేతలు హై కోర్టులో పిటిషన్లు వేయడంపై మండిపడ్డారు. మహిళలకిచ్చే పసుపు-కుంకుమ ఎవరైనా అడ్డుకుంటారా? అని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే డబ్బులు ఆగకూడదు గానీ, రాష్ట్రం ఇచ్చే డబ్బులు ఎందుకు ఆపాలని నిలదీశారు.

అద్దె మైకులు, వలస పక్షులు వైసీపీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారని, ఎన్నికలు కాగానే అందరూ హైదరాబాద్ చెక్కేస్తారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీతోనే ఏపీకి న్యాయం జరుగుతుందని అన్నారు. ఏపీకి డబ్బులు ఇవ్వడానికి మోడీకి చేతులు రాలేదు కానీ.. టీడీపీని నిందించడానికి పెద్ద నోరు వచ్చిందని చంద్రబాబు మండిపడ్డారు.

చదవండి: జగన్ కి బిగ్ షాక్! ఎన్నికల ముందు బాబు చివరి బ్రహ్మాస్త్రం!

- Advertisement -