
అమరావతి: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం… మంత్రులు, టీడీపీకి, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కార్యాలయాలు కేటాయించింది. గతంలో మంత్రిగా ఉన్న లోకేశ్ కార్యాలయాన్ని టీడీపీ శాసనసభాపక్ష కార్యాలయానికి కేటాయించారు.
అలాగే మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్‌కు ఇచ్చిన చాంబర్‌ను చంద్రబాబుకి కేటాయించగా, గత సభలో వైసీపీ శాసనసభాపక్ష కార్యాలయం, తెలుగుదేశం శాసనసభ పక్ష కార్యాలయం, ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌కు కేటాయించిన చాంబర్లను వైసీపీ తీసుకుంది.
అయితే గతంలో భారీ వర్షం వచ్చినప్పుడు జగన్‌కు కేటాయించిన చాంబర్‌లో నీరు కారుతుండేవని వైసీపీ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే నీళ్లు కారినా సరే… ‘వాస్తుపరంగా ఈ చాంబర్ చాలా బాగుంది’ అని విపక్షనేత హోదాలో జగన్‌కు అసెంబ్లీ ప్రాంగణంలో కేటాయించిన గదికి పండితులు కితాబిచ్చారు.
ఇక్కడే ఉంటే క్రమంగా అధికారానికి చేరువవుతారని చెబుతూ వచ్చారు. ఎన్నికల్లో అదే జరిగింది. వైసీపీ ఘన విజయం సాధించింది. దీంతో తమకు అదృష్టాన్నిచ్చిన పాత చాంబర్‌ను వైసీపీ వదులుకోలేదు.








