22.7 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఇప్పట్లో గవర్నర్‌ని మార్చే యోచన కేంద్రానికి లేదు: జీవీఎల్

ఇప్పట్లో గవర్నర్‌ని మార్చే యోచన కేంద్రానికి లేదు: జీవీఎల్

gvl
- Advertisement -

గుంటూరు: ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో..త్వరలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ను మారుస్తున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ను నియమిస్తారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

ఇక ఈ విషయంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందిస్తూ….. సామాజిక మాధ్యమాల వేదికగా వస్తున్న ఈ వదంతులను నమ్మొద్దని, ఇప్పట్లో నరసింహన్ ను మార్చే యోచన కేంద్రానికి లేదని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎయిమ్స్ ఏర్పాటు గురించి ప్రస్తావిస్తూ, 2020 నాటికి పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఇక కొందరు టీడీపీ నేతలు బీజేపీలో చేరతారనే ప్రచారంపై స్పందిస్తూ…తమ పార్టీలో చేరే వారిపై ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, సేవా భావంతో పార్టీలోకి వస్తానంటే వారిని తప్పకుండా ఆహ్వానిస్తామని చెప్పారు.

ఇదిలా ఉంటే మంగళవారం ఏపీ కొత్త సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జీవీఎల్ నరసింహారావు మర్యాదపూర్వకంగా కలిశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ ని కలిసి అభినందించారు.

చదవండి: కారెక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు, ఇక ఇప్పుడేం జరగబోతోంది?
- Advertisement -