టీడీపీ కార్యక్రమాలకు ‘ఆనం’ దూరం! జగన్ పార్టీలో చేరతారా?

- Advertisement -

అమరావతి: నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి ఆనం రామనారాయణ రెడ్డి కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుండటం చర్చనీయాంశంగా మారింది. ఆయన సోదరుడు ఆనం వివేకానందరెడ్డి మరణించినప్పటి నుంచి ఆయన క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు. దీంతో రామనారాయణ రెడ్డి టీడీపీని వీడి, వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం అధికమైంది.  మరోవైపు ఆనం ఈ వార్తలను ఖండించకపోవడం కూడా మరింత చర్చకు దారితీస్తోంది.

ఇటీవల జరిగిన మినీ మహానాడులో తెలుగుదేశం పార్టీపైన, పార్టీ నేతలపైన కూడా ఆనం రామనారాయణ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు, నెల్లూరులోనే ఉండి కూడా శనివారం ఆత్మకూరులో జరిగిన నవనిర్మాణ దీక్ష కార్యక్రమానికి ఆయన హాజరు కాలేదు.  ఈ నేపథ్యంలో.. పలువురు పార్టీ నేతలు కూడా ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. దీనిపై కొంతమంది టీడీపీ నేతలు మాట్లాడుతూ.. పార్టీ అధిష్ఠానం జోక్యం చేసుకుని ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉందని, లేకుంటే ఎన్నికల నాటికి ఆత్మకూరు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి మరింత గందరగోళంగా తయారయ్యే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించడం గమనార్హం.

- Advertisement -