ఆసుపత్రిలో హీరోయిన్ బిపాషా బసు.. ఇటీవలే పెళ్లి, ఇంతలోనే ఇలా…

- Advertisement -

ముంబై: బాలీవుడ్ నటి బిపాషాబసు అస్వస్థతకు గురై ఆసుపత్రిపాలైంది. కొంత కాలంగా ఆమె శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో బిపాషాను ఆమె కుటుంబ సభ్యలు ఆమెను ముంబైలోని ఓ ఆసుపత్రికి తరలించారు. బిపాషా ఇప్పటికే పలుమార్లు ఈ సమస్య కారణంగా ఆసుపత్రికి వెళ్లిందట. సమస్య మరింత తీవ్రంగా మారడంతో, ఆమెను మళ్లీ ఆసుపత్రిలో చేర్చారు.

ముంబైకి చెందిన ప్రముఖ పల్మనాలజిస్ట్ ప్రస్తుతం బిపాషా బసుకు చికిత్స అందిస్తున్నారు. మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండి ఆమె చికిత్స తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే బాలీవుడ్ నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ ను బిపాషా పెళ్లాడింది. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కబోతోంది.  ఇలాంటి సమయంలో అనుకోకుండా బిపాషా బసు ఇలా శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతుండడం ఆమె అభిమానులకు కాస్త బాధ కలిగించే విషయమే!

- Advertisement -