
చెన్నై : ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్, లండన్ థియేటర్ ఆర్టిస్ట్ మైఖెల్ కోర్సేల్ విడిపోయారు. గత కొంత కాలంగా పీకల్లోతు ప్రేమలో ఉన్న ఇద్దరూ ఇప్పుడు బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించిన మైఖేల్, జీవితం తామిద్దరినీ వ్యతిరేక మార్గాల్లో ఉంచిందని అనడం గమనార్హం.
తామిద్దరమూ ఇక ఒంటరి మార్గాల్లో నడవాల్సి రావడం దురదృష్టకరమని, శృతి ఎప్పటికీ తన బెస్ట్ ఫ్రెండేనని అన్నాడు. శృతితో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్న మైఖేల్, తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పాడు. కాగా, ఇద్దరూ మాట్లాడుకుని, ఇష్టపూర్వకంగానే విడిపోయారని శృతి సన్నిహిత వర్గాలు తెలిపాయి.
కాగా, 2016లో లండన్‌కు వెళ్లిన శృతికి మైఖేల్ పరిచయం కాగా, వీరిద్దరి మధ్యా మొదలైన స్నేహం తరువాత ప్రేమగా మారింది. మైఖేల్ కోసం నెలకోసారైనా శృతి లండన్ వెళ్లి వస్తుండేది. శృతి ఇంట్లో జరిగిన పలు శుభకార్యాలకు మైఖేల్ సైతం రావడంతో వీరిద్దరి వివాహం ఖాయమన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ చివరికి ఇలా జరిగిపోయింది.








