చంద్రబాబుకి బిగ్ షాక్! ఫలితాల ముందే వైసీపీలో జాయిన్ కాబోతున్న టీడీపీ ఎంపీ అభ్యర్థి!

12:42 pm, Fri, 26 April 19
Chandrababu Latest News, YCP Latest News, AP Election Latest News, Newsxpressonline

అమరావతి: ఏపీలో ఎన్నికల హోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నికలు ముగిసి మూడు వారాలు కావొస్తున్నా కూడా నేతలు ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఎన్నికల ఫలితాలు ఇప్పట్లో రాకపోవడమే అని తెలుస్తోంది. ఎన్నికలు ఫలితాలు మే 23 న వెలువడనున్నాయి. అలాగే ఏపీలోని ప్రధాన పార్టీలు అన్ని విజయం పై తమ ధీమాని వ్యక్తం చేస్తున్నాయి.

ఇకపోతే పోయిన ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన టీడీపీ , అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ చెందిన నేతలు కొంతమంది ప్రమాణ స్వీకారం కాకమునుపే టీడీపీలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు అదే విధంగా టీడీపీ నుండి వైసీపీలోకి గోడ దూకడానికి కొందరు ప్రముఖ నేతలు ఎదురుచూస్తున్నట్టు తెలుస్తుంది.

పోలింగ్ తర్వాత పలు సర్వేలు, రాజకీయ నాయకుల విశ్లేషణల ప్రకారం ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే రాయలసీమ ప్రాంతానికి చెందిన కొంతమంది జగన్ సామాజికవర్గానికి చెందిన నేతలు అప్పుడే జగన్‌తో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

గత ఎన్నికల్లో రాయలసీమలో వైసిపి సత్తా చాటింది. ఆ ప్రాంతంలో ఏ మాత్రం బలంలేని టిడిపి సీమ జిల్లాల నుంచి భారీ ఎత్తున విపక్ష వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకున్నారు.

చదవండి: నేను అధికారం లేని సీఎంని కాను! సీఎస్ వ్యాఖ్యలపై ఫైర్!

ఇదిలా ఉంటే టిడిపి నుంచి గెలుస్తామన్న నమ్మకం ఉండి, తమ పార్టీ అధికారంలోకి రాదని డిసైడ్ అయిన సీమ ప్రాంతానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ అభ్యర్థి అప్పుడే పక్కచూపులు చూస్తున్నటు సమాచారం. ఈ ఎన్నికల్లో సీమ ప్రాంతం నుంచి పోటీ చేసిన ఓ రాజకీయ వారసుడు ఫలితాలు వచ్చిన వెంటనే గోడదూకేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడట.

ఆ యువనేతకు వైసీపీ అధినేతతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఇదే విషయాన్ని ఆయన చాలా ఇంట‌ర్వ్యూల్లో ప్రస్తావించారు కూడా. ఫలితాలు వచ్చిన వెంటనే పార్టీ మారితే తన స్నేహితుడి దగ్గర మ‌రి కాస్త విలువ కూడా పెరుగుతుందని ఎంపీ అభ్యర్థి భావిస్తున్నాడట. తన పార్టీ మరి అంశంపై ఇప్పటికే సదరు ఎంపీ అభ్యర్థి సిగ్నల్ ఇవ్వడంతో జగన్ మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వీరిని పార్టీలోకి చేర్చుకునేటప్పుడు జగన్ ఆయా జిల్లాలకు చెందిన త‌మ పార్టీ నేత‌ల‌తో చ‌ర్చించాకే నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్టు స‌మాచారం.ఇప్పటి వరకు ఇతర పార్టీల టికెట్‌పై గెలిచిన నేతలను జ‌గ‌న్ వారు ఆ పదవులకు రాజీనామా చేశాకే వైసీపీలో చేర్చుకున్నారు. ఇప్పుడు కూడా ఫిరాయింపులను ఎంక‌రేజ్ చేయడానికి ఆయ‌న సిద్ధంగా లేరని తెలుస్తోంది.

ఏదేమైనా ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలు ఫ్యాన్ కింద సేదతీరేందుకు సిద్ధంగా ఉన్నారు. ముందుగా సీమ జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేసిన ఆ యువ‌నేత పేరు బ‌య‌ట‌కు వ‌చ్చినా…ఆ త‌ర్వాత లిస్టులో చాలా మంది ఎమ్మెల్యే క్యాండెట్లు పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

చదవండి: ఏపీలో రాష్ట్రపతి పాలన!? కేంద్రంలో కదలికలు.. షాక్‌లో టీడీపీ నేతలు!