22.4 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఏపీకి మరో తుపాన్ ముప్పు! భయపెడుతోన్న ‘ఫణి’, తమిళనాడు, కేరళలోనూ హై అలర్ట్…

ఏపీకి మరో తుపాన్ ముప్పు! భయపెడుతోన్న ‘ఫణి’, తమిళనాడు, కేరళలోనూ హై అలర్ట్…

- Advertisement -

ఏపీ : దక్షిణ కోస్తావైపు ‘ఫణి’ తుపాన్ దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం మరికొద్ది గంటల్లో బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

వాయువ్య దిశగా వాయుగుండం పయనిస్తూ తుపాన్‌గా మారనుందని తెలిపింది. ఏప్రిల్ 30వ తేదీలోపు దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. 

దీంతో తమిళనాడులో హై అలర్ట్ ప్రకటించారు. ఏప్రిల్ 30వ తేదీన అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
‘ఫణి’ తుపాన్ ప్రభావం ఏపీపై ఉండనున్నట్లు పేర్కొంది.

కోస్తాంధ్రలో భారీ వర్షాలు, ఈదురుగాలులు…

ఏప్రిల్ 28 నుండి ఏప్రిల్ 30 తేదీల మధ్యలో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని, భారీ ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తీరం దాటే సమయంలో గాలుల వేగం మరింత అధికమవుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తుపాన్ ప్రభావం కారణంగా కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, అక్కడకక్కడ పిడుగులు పడే అవకాశం కూడా ఉందని ఐఎండీ హెచ్చరించింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది.

కేరళలో హై అలర్ట్, ముందస్తు హెచ్చరికలు జారీ…

మరోవైపు ‘ఫణి’ తుపాన్‌తో కేరళ కూడా అలర్ట్ అయ్యింది. అక్కడ ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు.  ఇటీవలే వరదలతో అతలాకుతలమైన కేరళపై మళ్లీ ఈ తుపాన్ ప్రభావం పడనుందా? అనే భయంతో కేరళ విపత్తు నిర్వహణ సంస్థ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.

తుపాన్ వల్ల గంటకు 90 నుండి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. 

- Advertisement -