- Advertisement -
మాజీ హీరోయిన్ రంభ మరోసారి తల్లి కాబోతోంది. 2010లో ఇంద్రన్‌ను వివాహమాడిన రంభ ఆ తరువాత కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె మరోసారి గర్భవతి అయింది. ఈ విషయాన్ని రంభ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
తన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన రంభ.. మూడోసారి తల్లినవుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందంటూ కామెంట్ చేసింది. దీంతో ఆమె అభిమానులు, సన్నిహితులు రంభకు విషెస్ తెలియజేస్తున్నారు. సురక్షితంగా ప్రసవం జరగాలని కోరుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఒకప్పుడు అగ్ర హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన రంభకు ఆ తరువాత క్రమేణా అవకాశాలు తగ్గిపోయాయి. తర్వాత ఆమె పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్‌లు కూడా చేసింది.
- Advertisement -