
- Advertisement -
ఢిల్లీ: ఎప్పుడు వివాదాలతో సావాసం చేసే మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూమరోసారి చిక్కుల్లో పడ్డారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేస్తున్న సిద్ధూ… ఇటీవల మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగిన ఓ సభలో ప్రధాని మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మోడీని టార్గెట్ చేసుకుని….అనిల్ అంబానీకి మేలు చేసేందుకే రాఫెల్ ఒప్పందం కుదుర్చుకున్నారని, మోడీ అవినీతిపరుడని సిద్ధూ విమర్శలు చేశారు. ఇక మోడీ అమరజవాన్ల పేరుమీద కూడా రాజకీయాలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. అయితే ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న బీజేపీ నేతలు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. దాంతో, ఈసీ 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలంటూ సిద్ధూకు నోటీసులు పంపింది.
చదవండి: ఏపీ రాజకీయాలలో అసలు ట్విస్ట్ ఇదే! కోడలి నాని అనూహ్య నిర్ణయం!
అయితే సిద్ధూకు ఈసీ నోటీసులు పంపడం ఇదే మొదటిసారికాదు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో ముస్లిం సోదరులు కాంగ్రెస్‌కే ఓటేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈసీ ఆయన్ను మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారం నుంచి నిషేధం విధించింది. మరి ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
చదవండి సిక్కుల ఊచకోతపై వ్యాఖ్యలు: పిట్రోడాపై రాహుల్ ఫైర్…
- Advertisement -





