
ముంబై: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న వన్డే క్రికెట్ సమరం మరో రెండు రోజుల్లో మొదలు కానుంది. ఇప్పటికే వార్మప్ మ్యాచ్‌లో బిజీగా ఉన్న అన్ని జట్లు తమ సామర్థ్యానికి తగ్గట్లు ప్రపంచ కప్ పోరుకు సిద్ధమవుతున్నారు.
ఇక ఈ మ్యాచ్‌లు అన్నీ రౌండ్ రాబిన్ పద్ధతిలో జరుగుతున్నాయి. అంటే ప్రతి జట్టు మిగతా అన్నీ జట్లతో తలపడనున్నాయి. అయితే ఈసారి ప్రపంచ కప్ ఏ జట్టు గెలుస్తుందని ఆసక్తి అందరిలోనూ ఉంది.
ఈ నేపథ్యంలో టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్….ఫైనల్‌కి చేరే రెండు జట్ల పేర్లని చెప్పాడు. వరల్డ్ కప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఇంగ్లండ్, ఇండియాకే ఉన్నాయని స్పష్టం చేశాడు.
అయితే ఆస్ట్రేలియా కూడా మంచి ఫామ్‌లో ఉందని, ఆ జట్టుకు కూడా ఫైనల్ అవకాశాలు ఉన్నాయని వెల్లడించాడు. అలాగే భారత్ వరల్డ్ కప్ గెలవడంలో హార్దిక్ పాండ్యా కీలకం అవుతాడని యువీ తెలిపాడు.
అటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల సత్తా చాటాడానికి ఇదొక చక్కటి టోర్నమెంట్ అని చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ పిచ్‌లపై ఇద్దరు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగితే, పాండ్యా మూడో పేస్ బౌలర్‌గా పనికొస్తాడని, ఈ కాంబినేషన్ జట్టులో సమతుల్యాన్ని తీసుకు వస్తుందని వివరించాడు.








