
ఇంగ్లాండ్: ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ రెండో విజయం నమోదు చేసింది. రాస్ టేలర్ (91 బంతుల్లో 9 పోర్లతో 82) అర్ధ శతకంతో రాణించడంతో బుధవారం బంగ్లాదేశ్‌తో రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో కివీస్ 2 వికెట్ల తేడాతో నెగ్గింది. 245 పరుగుల లక్ష్యం కోసం బరిలోకి దిగిన కివీస్ 47.1 ఓవర్లలో 248/8 స్కోరు చేసి గెలిచింది.
కేన్ విలియమ్సన్ (40)ను హసన్ పెవిలియన్ చేర్చగా.. లాథ మ్ డకౌటయ్యాడు. అయితే, 42 బంతుల్లో 27 పరుగులు కావాల్సిన దశలో గ్రాండ్‌హోమ్ (15), నీషమ్ (25) వరుసగా అవుట్ కావడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. 7 రన్స్ కావాల్సిన సమయంలో హెన్రీ (6)ని సైఫుద్దీన్ బౌల్డ్ చేశాడు.
కానీ, శాంట్నర్ (17 నాటౌట్), ఫెర్గూసన్ (4 నాటౌట్) మరో 17 బంతులు మిగిలుండగానే జట్టును గెలిపించారు. ఓపెనర్ గప్టిల్ (25), కొలిన్ మన్రో (24)ను షకీబల్ పెవిలియన్ చేర్చాడు. షకీబల్‌తోపాటు హసన్, సైఫుద్దీన్, హొస్సేన్ తలా 2వికెట్లు పడగొట్టారు.
అంతకుముందు కెరీర్‌లో 200వ వన్డే ఆడుతున్న షకీబల్ (68 బంతుల్లో 7 ఫోర్లతో 64) అర్ధశతకంతో ఆదుకోవడంతో.. తొలుత బంగ్లాదేశ్ 49.2 ఓవర్లలో 244 పరుగులకు కుప్పకూలింది. మాట్ హెన్రీ 4 వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్ (2/44) టెయిలెండర్ల పనిబట్టాడు.








