
హైదరాబాద్: ఇంగ్లాండ్‌లో పర్యటనలో భాగంగా ఎసెక్స్ జట్టుతో మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో భాగంగా శుక్రవారం, చివరి రోజు కూడా అభిమానులు భారత క్రికెటర్లకు సంప్రదాయక భాంగ్రా నృత్యాలతో ఆహ్వానం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో ఎసెక్స్ క్రికెట్ జట్టు తన అధికారిక ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.
ఈ వీడియోలో భారత క్రికెటర్లు ఫీల్డింగ్ చేసేందుకు మైదానంలోకి వస్తున్న క్రమంలో స్థానిక అభిమానులు భాంగ్రా నృత్యాలతో స్వాగతం పలికారు. ముందుగా మైదానంలోకి అడుగుపెట్టిన కోహ్లీ భాంగ్రా స్టెప్పులేస్తూ కనిపించాడు. ఆ తర్వాత మైదానంలోకి వచ్చిన శిఖర్ ధావన్ కూడా తనదైన శైలిలో భాంగ్రా డ్యాన్స్ చేస్తూ వెళ్లాడు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్-భారత్ మధ్య ఆగస్టు 1నుంచి జరిగే టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.
Two @BCCI players have enjoyed their time at Chelmsford!
Well played, @imVkohli & @SDhawan25! ???#ESSvIND pic.twitter.com/Uz8W7p2xoh
— Essex Cricket (@EssexCricket) July 27, 2018
ఇదిలా ఉండగా, ఇరు జట్ల మధ్య జరిగిన మూడు రోజుల సన్నాహక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ వార్మప్ మ్యాచ్‌లో బాట్స్‌మెన్ ఆధిపత్యం ప్రదర్శించగా.. బౌలర్లు కూడా తీవ్రంగానే శ్రమించారు.
వార్మప్ మ్యాచ్ జరిగిందిలా…
237/5 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన ఎసెక్స్ తొలి ఇన్నింగ్స్‌ను 94 ఓవర్లలో 8 వికెట్లకు 359 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో భారత్‌కు 36 పరుగుల ఆధిక్యం దక్కింది. రెండో రోజు మొత్తం పేసర్లతో బౌలింగ్ చేయించిన కోహ్లీ చివర్లో జడేజాను రంగంలోకి దించాడు. ఇక మూడో రోజు కుల్దీప్, అశ్విన్‌లను ప్రయోగించినా.. ఎక్కువసేపు వాళ్లతో బౌలింగ్ చేయించలేదు. ఇద్దరు కలిసి కేవలం 9 ఓవర్లు మాత్రమే వేసినప్పటికీ వికెట్లు మాత్రం తీయలేకపోయారు. ఆ తర్వాత స్వింగ్‌ను అందిపుచుకున్న ఉమేశ్ (4/35), ఇషాంత్ (3/59).. ఫోస్టర్‌ను కట్టడి చేశారు. ఇన్నింగ్స్ 70వ ఓవర్‌లో ఫోస్టర్‌ను ఔట్ చేయడంతో ఆరో వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.
ధావన్ మరోసారి డకౌట్…
వెంటనే కోల్స్ (0) ఔటైనా.. చివర్లో నిజ్జర్ (29 నాటౌట్), ఖుషి (14 నాటౌట్) వేగంగా ఆడి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 21.2 ఓవర్లలో 2 వికెట్లకు 89 పరుగులు చేసింది. ధావన్ (0) మరోసారి నిరాశపర్చాడు. ఓపెనింగ్‌లో దిగిన రాహుల్ (36 నాటౌట్) మెరుగ్గా ఆడటంతో ఓపెనింగ్‌లో మరో ప్రత్యామ్నాయం దొరికినట్లయింది.
మళ్లీ విఫలమైన పుజారా…
భారీ ఆశలు పెట్టుకున్న పుజారా (23) మరోసారి విఫలమయ్యాడు. దీంతో భారత్ 40 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. రాహుల్‌తో కలిసి రహానే (19 నాటౌట్) ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేసినా.. మధ్యలో వరుణుడు అడ్డుకోవడంతో గంటన్నర ముందుగానే మ్యాచ్‌ను నిలిపేశారు.








