మీ మొఖం మీద మొటిమలు  ఉన్నాయా? అయితే ఇలా చేయండి..

acne-problem
- Advertisement -

acne-problemఉదయం లేవగానే ఒక్కసారి మీ ముఖం అద్దంలో చూసుకునేసరికి.. కెవ్వు మని కేక పెడతారు. కారణం ఏమిటంటే.. మీ ముఖం మీద మొటిమలు కనిపించడమే. మొటిమలు మటుమాయం కావాలన్నా.. గరుకుగా, కాంతిహీనంగా మారిన చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మార్చేందుకు చిన్న చిన్న చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.

కానీ, చాలామంది హడావుడిగా బజారుకు పరుగులు పెడతారు. అక్కడ ఇబ్బడిముబ్బడిగా లభించే క్రీములు, వాటి ప్యాకింగ్, హంగామా, ధర.. ఇవన్నీ చూస్తారు. ఎంతైనా ముఖం కదా.. అందుకని బాగా ఖరీదైనది, బ్రాండెడ్ అనుకున్నది చూసి రూ.500 పోయినా పర్వాలేదనుకుని కొనేసి, ఇంటికి తెచ్చి ఆ క్రీమ్ ముఖంపై అప్లై చేయడం మొదలుపెడతారు.  సదరు క్రీమ్ ప్యాకింగ్ పై కనీ కనిపించని అక్షరాల్లో ముద్రించి ఉన్నదాన్ని పట్టి పట్టి చూసి ఫస్ట్ వీక్ మొదలు పెడతారు.. అయినా మొటిమలు తగ్గకపోగా ఇంకా పెరుగుతుంటాయి.

‘అమ్మ బాబోయ్ .. ఈ కంపెనీ క్రీమ్ మన ముఖానికి పడలేదు.. వేరే బ్రాండ్ క్రీమ్ తెేవాల్సిందే..’

అంటూ మళ్ళీ బజారుకు పరిగెడతారు. ఈసారి జేబులోంచి రూ .1000 వదిలించేసుకుంటారు.. ‘మళ్ళీ సేమ్ కార్డు ప్రింటింగ్ .. బట్ నేమ్స్ మాత్రం డిఫరెంట్’ అన్నట్టు.. ఆ క్రీమ్ రాసినా సేమ్ రిజల్ట్.. మొటిమలు తగ్గవు. దీంతో తర్వాత బ్యూటిషియన్ దగ్గరికి, ఆ తర్వాత స్కిన్  డాక్టర్ దగ్గరికి పరిగెడతారు.  కానీ ఎక్కడకు వెళ్లినా అదే కార్డు మళ్ళీ మళ్లీ పడుతుంటుంది. చివరికి మీ అవస్థ చుసిన మీ అమ్మమ్మ ‘ఇటు రావే అమ్మాయ్..’ అంటూ పిలిచి కొన్ని చిట్కాలు చెబుతుంది. అవే ఇక్కడ మేం చెప్పేది.. ఓకే కదా?

కావలసిన పదార్థాలు: 

ఓట్స్ – పావు టేబుల్ స్పూన్,  తేనె – ముప్పావు టేబుల్ స్పూన్,  ఆలీవ్ ఆయిల్ -పావు టేబుల్ స్పూన్,  శనగ పిండి – 1 టేబుల్ స్పూన్,
పాలు – 2 టేబుల్ స్పూన్లు.

తయారీ ఇలా …

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఓట్స్, తేనె కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. తర్వాత ఆ మిశ్రమానికి శనగపిండి, పాలు జత చేసి బాగా మిక్స్ చేయాలి. దాన్ని ఓ పక్కన పెట్టుకుని, చల్లని నీళ్లతో ముఖాన్ని కడుక్కొని ఆవిరి పట్టించాలి. ఇప్పుడు సిద్ధం చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.. 30 నిముషాల తర్వాత గోరు వెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.  ముఖంపై మొటిమలు మటుమాయం అవడమేకాదు, మీ చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది. ఫలితంగా మీ పూర్వ ముఖారవిందం.. ఒక కొత్త మెరుపు.. మీ సొంతమవుతాయి.

- Advertisement -