
లండన్: ప్రపంచకప్ మొదటి మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో ఘోరపరాజయం పాలైన పాకిస్థాన్ జట్టు….రెండో మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఉత్కంఠత భరితంగా సాగిన మ్యాచ్‌లో…ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుని చిత్తు చేసింది.
బ్యాటింగ్‌కు స్వర్గధామమైన ట్రెంట్‌బ్రిడ్జ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాక్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 348 పరుగులు భారీ స్కోరు చేసింది. పాక్‌లో మహ్మద్ హఫీజ్ (62 బంతుల్లో 84), బాబర్ ఆజమ్ (63), కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ (44 బంతుల్లో 55) అర్ధశతకాలతో దుమ్ములేపారు.
ఇక ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్, మొయిన్ అలీ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. వుడ్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం 349 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్…గట్టిగా పోరాడిన ఓటమి పాలైంది. పాక్ బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 334 పరుగులకు పరిమితమైంది. దీంతో పాకిస్థాన్ 14 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో జో రూట్ (107), బట్లర్ (103) సెంచరీలు చేసినా…లక్ష్యం వైపు నడిపించలేకపోయారు. పాక్ బౌలర్లలో షాదబ్ 2, అమీర్ 2, రియాజ్ 3, హఫీజ్, మలిక్ చెరో వికెట్ తీసుకున్నారు. ఇక ఆల్ రౌండ్ ప్రదర్శనతో మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించిన హఫీజ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
కాగా, వరల్డ్ కప్‌లో భాగంగా నేడు అఫ్గానిస్తాన్-శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.








