ముంబయి: వెస్టిండీస్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ రోహిత్ శర్మ 137 బంతుల్లో 162 పరుగులతో(29×4, 4×6), అంబటి రాయుడు 81 బంతుల్లో 100 పరుగులతో (8×4, 4×6) చెలరేగి ఆడటంతో టీమిండియా తన ప్రత్యర్థి జట్టుకి 378 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రోహిత్ శర్మ, అంబటి రాయుడు ఇద్దరూ శతకాలతో కదం తొక్కారు.
ఆ తరువాత శిఖర్ ధావన్ 40 బంతుల్లో 38 పరుగులు (4×4, 2×6) విరాట్ కొహ్లీ 17 బంతుల్లో 16 పరుగులు (2×4), ఎమ్ ఎస్ దోని 15 బంతుల్లో 23 పరుగులు(2×4) కేదార్ జాదవ్ 7 బంతుల్లో 16 పరుగులు (3×4)(నాట్ ఔట్), రవీంద్ర జడేజా 4 బంతుల్లో 7 పరుగులు (1×4)(నాట్ ఔట్), చేసి టీమిండియాని భారీ స్కోర్ దిశగా నడిపించారు.
వెస్టిండీస్ బౌలర్‌లు కెమర్ రోచ్ 2 వికెట్లు, ఆష్లీ నర్స్ 1 వికెట్, కీమో పాల్ 1 వికెట్ చోపున తీశారు. దీంతో వెస్టిండీస్ 378 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగనుంది