24.2 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home క్రికెట్ వికెట్లకి తాకిన పడని బెయిల్స్: మార్చే ఉద్దేశం లేదంటున్న ఐసీసీ

వికెట్లకి తాకిన పడని బెయిల్స్: మార్చే ఉద్దేశం లేదంటున్న ఐసీసీ

- Advertisement -

లండన్: ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ పోటీల్లో ఎల్‌ఈ‌డి బెయిల్స్‌పై వివాదం చెలరేగుతుంది. బౌలర్ బలంగా వేసిన బాల్ వికెట్లని తాకిన బెయిల్స్ పడకపోవడంతో…అంపైర్ బ్యాట్స్‌మెన్‌ని నాటౌట్‌గా పరిగణిస్తున్నాడు. దీంతో ఎల్‌ఈ‌డి బెయిల్స్ మార్చాలని అన్నీ దేశాల జట్ల నుంచి డిమాండ్ వస్తోంది.

అయితే ఈ ఎల్‌ఈ‌డి బెయిల్స్‌ని మార్చే ఉద్దేశం లేదని ఐసీసీ తేల్చి చెప్పింది. టోర్నీ మధ్యలో ‘జింగ్’ బెయిల్స్‌ను మార్చమని, ఆట సమగ్రతను కాపాడాల్సిన అవసరం ఉందని, ప్రపంచకప్‌లో భాగంగా జరిగే 48 మ్యాచ్‌ల్లోనూ ఇవే బెయిల్స్ ఉంటాయని స్పష్టం చేసింది.

కాగా, ఆదివారం టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య మ్యాచ్‌లో బుమ్రా వేసిన బంతి డేవిడ్‌ వార్నర్‌ బ్యాట్‌ను తాకుతూ లెగ్‌ స్టంప్స్‌ను బలంగా తాకింది. అయినా వికెట్ల మీద నుంచి బెయిల్స్‌ కదల్లేదు. దీంతో వార్నర్‌ బతికిపోయాడు.

అటు ఇదే వరల్డ్ కప్ లోనే ఇంగ్లాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో.. రషీద్‌ వేసిన బంతిని డికాక్‌ రివర్స్‌ స్వీప్‌ ఆడాడు. బ్యాట్‌ను తాకిన బంతి లెగ్‌స్టంప్‌ను బలంగా తాకినా బెయిల్స్‌ కిందపడలేదు. పైగా అది ఫోర్ వెళ్లింది. ఇలా ఈ వరల్డ్ కప్‌లోనే రెండు మూడు సంఘటనలు జరిగాయ. అయినా సరే ఈ టోర్నీలో బెయిల్స్ మార్చే ప్రసక్తి లేదని ఐసీసీ చెప్పడం గమనార్హం.

చదవండి: బ్యాడ్ న్యూస్: వరల్డ్ కప్‌ నుంచి ధావన్ అవుట్…
- Advertisement -