21.7 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ నా కుటుంబంపై ఇంకా ఎన్ని కేసులు పెడతారో తెలియట్లేదు: టీడీపీ నేత

నా కుటుంబంపై ఇంకా ఎన్ని కేసులు పెడతారో తెలియట్లేదు: టీడీపీ నేత

Kodela Siva Prasad News , TDP Leader News, AP News, Newsxpressonline
- Advertisement -

గుంటూరు: తన కుటుంబపై వస్తున్న ఆరోపణలపై ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… తన కుటుంబ సభ్యులపై ఇప్పటి వరకు ఏడెనిమిది కేసులు పెట్టారని, ఇంకా వారు ఎన్ని కేసులు పెడతారో, ఎంత వరకు పెడతారో తనకు తెలియదన్నారు.

అయితే తన కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి రారని, వారి పనులు వారు చేసుకుంటున్నారని ఎన్నోసార్లు చెప్పానని కోడెల గుర్తు చేశారు. అటువంటిది వారిపై కేసులు పెట్టుకుంటూ పోతునే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక విజయసాయి రెడ్డి ట్వీట్ తప్పుడు కేసులు పెట్టాలని ప్రోత్సహించేలా ఉందని కోడెల పేర్కొన్నారు. స్పీకర్‌గా తాను అసెంబ్లీ ప్రతిష్ఠను దిగజార్చానని ఆయన ట్వీట్ చేశారని, అది కరెక్ట్ కాదని అన్నారు.

నవ్యాంధ్రకి తాను తొలి స్పీకర్‌గా వ్యవహరించినందుకు గర్వంగా ఉందన్న కోడెల.. తనను అధికార ప్రతిపక్ష నాయకులు ఏకగ్రీవంగా ఆ పదవిలో కూర్చోబెట్టినట్టు చెప్పారు. స్పీకర్‌గా తానెప్పుడూ తప్పుడు పనులు చేయలేదన్నారు. అందరికీ అవకాశం ఇచ్చానని చెప్పారు.

చదవండి: అందుకే అక్కడ టీడీపీ ఓడిపోయింది: మంత్రి పెద్దిరెడ్డి
- Advertisement -