22.2 C
Hyderabad
Sunday, November 29, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్‌లుగా మరో ముగ్గురుకి అవకాశం ఇచ్చిన సీఎం…

ప్రభుత్వ విప్‌లుగా మరో ముగ్గురుకి అవకాశం ఇచ్చిన సీఎం…

AP Chief Whips News, YS Jagan News, AP Latest Updates, Newsxpressonline
- Advertisement -

అమరావతి: ఏపీ నూతన మంత్రివర్గంలో చోటు దక్కని వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తి చెందకుండా ఉండేందుకు సీఎం జగన్… ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలను ప్రభుత్వ విప్‌లుగా నియమించిన విషయం తెలిసిందే.

రాయచోటి ఎమ్మెల్యే గడిచోట శ్రీకాంత్‌రెడ్డిని చీఫ్‌ విప్‌ (కేబినెట్‌ హోదా)గా నియమించగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాడుగు ఎమ్మెల్యే బూడి ముత్యానాయుడులను విప్‌లుగా నియమించారు.

ఈ నేపథ్యంలోనే నూతన శాసన సభలో ప్రభుత్వ విప్‌లుగా మరో ముగ్గురికి అవకాశం దక్కింది. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలను విప్‌లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక వీరితో కలుపుకుని మొత్తం విప్‌ల సంఖ్య ఎనిమిదికి చేరినట్టయింది.

చదవండి: కేసీఆర్…. నీకంటే చిన్నవాడైనా జగన్ మంచి పనులు చేస్తున్నాడు..
- Advertisement -