28.2 C
Hyderabad
Sunday, October 11, 2026
- Advertisement -
Home క్రికెట్ అత్యాచారం చేస్తామని, చంపేస్తామని నన్ను బెదిరిస్తున్నారు: క్రికెటర్ మహ్మద్ షమి భార్య ఆవేదన

అత్యాచారం చేస్తామని, చంపేస్తామని నన్ను బెదిరిస్తున్నారు: క్రికెటర్ మహ్మద్ షమి భార్య ఆవేదన

cricketer-mohammed-shamis-estranged-wife-hasin-jahan-receives-death-threat
- Advertisement -

కోల్‌కతా: అయోధ్యలో నిర్మితమవనున్న రామ మందిరానికి భూమి పూజ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన క్రికెటర్ మహ్మద్ షమి భార్య హసిన్ జహాన్‌కు బెదిరింపు సందేశాలు వచ్చినట్లు తెలుస్తోంది.

తనపై అత్యాచారం జరుపుతామని, చంపేస్తామని కొంత మంది సోషల్ మీడియా ద్వారా బెదిరిస్తున్నారంటూ ఆమె కోల్‌కతా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. 

అయోధ్యలో శ్రీరామధామం భూమి పూజ సందర్భంగా హసిన్ జహాన్ హిందువులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. 

ఈ నేపథ్యంలో ఆమెకు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. దీనిపై హసిన్ జహాన్ మాట్లాడుతూ.. హిందూ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు చెప్పాకే ఇలా జరుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘కొంతమంది ఉద్దేశపూర్వకంగా దూషిస్తున్నారు.. ఇది చాలా బాధాకరం, కొంతమంది అయితే తనపై అత్యాచారం చేస్తామని భయపెడుతున్నారు. మరికొందరైతే ఏకంగా చంపేస్తామని బెదిరిస్తున్నారు..’’ అని ఆమె పేర్కొన్నారు. 

ప్రస్తుతం తాను నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నానని, తన కూతురి భవిష్యత్తు గురించి ఆందోళన కలుగుతోందని పేర్కొన్నారు. ఈ బెదిరింపులు ఇలాగే కొనసాగకమునుపే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆమె తన ఫిర్యాదులో పోలీసులను కోరారు. 

- Advertisement -