- Advertisement -
దుబాయ్: ఆసియాలో తమ ఆధిపత్యం నిరూపించుకునేందుకు భారత్ జట్టకు మరో అవకాశం. ఫైనల్ పోరు పాకిస్థాన్‌తో ఉంటుది అని అంతా భావించినా…. బుధవారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు అనూహ్యంగా ఓటమి ఎదురైంది. దీంతో శుక్రవారం జరిగే ఆసియా కప్ ఫైనల్లో భారత్ జట్టు బంగ్లాదేశ్‌ను ఎదుర్కొబోతోంది.
ఇప్పటికే ఆరు సార్లు కప్ గెలుచుకున్న భారత్ జట్టు ఈసారీ కూడా ఫేవరెట్‌గానే కనిపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకున్న సీనియర్ ఆటగాళ్లంతా తిరిగి జట్టులో చేరారు. దీంతో ప్రత్యర్థికి జట్టకు కష్టాలు తప్పెలా లేవు. ఇ
ప్పటి వరుకు బంగ్లాదేశ్ జట్టు ఫైనల్‌కు వచ్చిన ప్రతీసారి భారత్ చేతిలో భంగపడుతు వచ్చింది. 2016 టీ20 ఆసియా కప్‌లోనూ ఈ రెండు జట్లే ఫైనల్‌కు చేరగలిగాయి. భారత్ విజయం సాధించింది.
వాతావరణం, పిచ్ రిపోర్ట్…..
ఇక్కడి అధిక వేడిని దృష్టిలో ఉంచుకుని టాస్ నెగ్గిన జట్టు మొదట బ్యాటింగ్ తీసుకోవడం జరుగుతుంది. దీంతో టాస్ కీలకం కానుంది , వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేకపోగా ఉష్ణోగత్ర 41 డిగ్రీలుగా ఉండవచ్చును.
తుది జట్లు
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధవన్, అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్, భువనేశ్వర్ కుమార్,యజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, , జస్ర్పీత్ బుమ్రా.
బంగ్లాదేశ్: మష్రఫే మోర్తజా (కెప్టెన్)లిటన్ దాస్, సౌమ్య సర్కార్, మోమినుల్ హక్, మహ్మద్ మిథున్, ఇమ్రుల్ కయేస్, ముష్ఫికర్ రహీమ్, మహ్ముదుల్లా, మెహదీ హసన్, రూబెల్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రహమాన్.
- Advertisement -