
హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ మంచు విష్ణు, విరానికా దంపతులు మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇప్పటికే వీరికి అరియానా, వివియానా అనే ఇద్దరు కూతుళ్లతో పాటు అవ్‌రామ్ అనే కుమారుడు ఉన్నాడు. త్వరలో వీరు మరో కూతురుకి జన్మనివ్వబోతున్నారు.
ఈ విషయాన్ని విష్ణు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ప్రస్తుతం వీరు అమెరికాలోని విరానికా హోమ్ టౌన్‌లో ఉన్నారు. ఇక్కడ తమ ఫేవరెట్ ప్లేసులో దిగిన ఫిక్ షేర్ చేస్తూ అభిమానులతో ఈ శుభవార్తను పంచుకున్నారు. ఈ ఫోటోలో విరానికా బేబీ బంప్‌తో కనిపించారు. ఇక మంచు విష్ణుకు పలువురు శుభాభినందనలు తెలుపుతున్నారు.
విష్ణు ఈ ట్వీట్ చేయగానే మంచు ఫ్యామిలీ అభిమానులు వీరిని విష్ చేస్తూ ట్వీట్ల వర్షం కురిపించారు. కొందరు మాత్రం వీరు ఎడతెరిపి లేకుండా పిల్లలను కంటున్నారు, కుటుంబ నియంత్రణ పాటించడం లేదంటూ ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు.
మంచు విష్ణు చేసిన ట్వీట్ మీద ఓ అభిమాని స్పందిస్తూ.. ఇది మంచి విషయమే, ఇండియాకు మీ లాంటి బిజినెస్ మైండ్స్ కావాలి, కానీ మళ్లీ బిడ్డను కనే బదులు ఎవరైనా అనాధను దత్తత తీసుకోవచ్చుకగా బ్రదర్. అలా ఒకసారి ట్రై చేయండి. ఈ విషయంలో మీ సిస్టర్ మంచు లక్ష్మిని అనుసరించండి’ అని సూచించారు.
https://twitter.com/iVishnuManchu/status/1123839153718870017/photo/1








