
హైదరాబాద్: తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన ‘టెంపర్’ . మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇటీవల హిందీలో ‘సింబా’ పేరుతో విడుదలై అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది. అలాంటి ఈ సినిమా తమిళంలో విశాల్ హీరోగా రూపొందింది.
అయోగ్య పేరుతో నిర్మితమైన ఈ సినిమాలో కథానాయికగా రాశి ఖన్నా నటించింది.తమిళంలో ఈ సినిమా విడుదలకి ముహూర్తం ఖరారు చేశారు. ఏప్రిల్ 19వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. వెంకట్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, పార్తీబన్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు.
విశాల్ కి మాస్ హీరోగా మంచి ఇమేజ్ ఉండటం వలన, ఈ సినిమా ఆయనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. తెలుగు, హిందీ భాషల్లో భారీ విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమా, తమిళంలోను సందడి చేస్తుందేమో చూడాలి.
చదవండి: బాలకృష్ణ…బోయపాటి సినిమా ప్రారంభం ఎప్పుడో తెలుసా?








