26.2 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ సునీల్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన నటుడు ఆకాశ్

సునీల్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన నటుడు ఆకాశ్

- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్ హీరో సునీల్‌పై నటుడు ఆకాశ్ తీవ్ర ఆరోపణలు చేశాడు. ‘ఆనందం’ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన ఆకాశ్.. ఆ తర్వాత అనూహ్యంగా తెలుగు తెరకు దూరమయ్యాడు. గత రెండు రోజులుగా మీడియాలో మళ్లీ కనిపిస్తున్న ఆకాశ్.. నటుడు సునీల్‌పై తీవ్ర ఆరోపణలు చేశాడు. అప్పట్లో తనను భయ్యా.. భయ్యా అని పిలిచేవాడని, ఇప్పుడు ఏయ్ సునీల్ అని పిలుస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు.

‘అందాల రాముడు’ సినిమా కోసం సునీల్ బతిమాలితేనే ఆ సినిమాలో రెండో హీరోగా చేశానని ఆకాశ్ చెప్పుకొచ్చాడు. అయితే సినిమా పోస్టర్లో తన స్టిల్ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారని ఆరోపించాడు. అందాల రాముడు సినిమా హిట్ అయిన తరువాత సునీల్ ఏ స్టేజ్ పైనా తన గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదన్నాడు. అంతకుముందు ‘భయ్యా .. భయ్యా’ తిరిగేవాడని, ఆ తరువాత నుంచి ‘ఏయ్ ఆకాశ్’ అని పిలవడం మొదలుపెట్టాడని అన్నాడు. సునీల్ అలా మారిపోవడంతో తాను చాలా బాధపడ్డానన్నాడు.

- Advertisement -