భారీ ధరకు అమ్ముడుపోయిన ఆర్‌ఆర్‌ఆర్ ఓవర్సీస్ హక్కులు.?

3:06 pm, Fri, 14 June 19
rrr latest update

హైదరాబాద్: బాలీవుడ్‌ని సైతం ఆకట్టుకునేలా తెరకెక్కుతున్న టాలీవుడ్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ . దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్‌లు హీరోలుగా నటిస్తున్నారు.

ఇక బాలీవుడ్ స్టార్స్ అజ‌య్ దేవ‌గ‌ణ్‌, అలియా భ‌ట్ కూడా ఇందులో న‌టిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఇక దాదాపు 400 కోట్ల రూపాయ‌ల భారీ బ‌డ్జెట్‌తో, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో తెర‌కెక్కుతున్న సినిమా నిర్మాణం పూర్తి కాక‌ముందే సినిమా బిజినెస్ మంచి క్రేజ్ ఏర్ప‌డింది.

లేటెస్ట్ ఫిల్మ్ వర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా ఓవ‌ర్‌సీస్ బిజినెస్ పూర్త‌య్యింద‌ట‌. వివ‌రాల ప్ర‌కారం దుబాయ్‌కి చెందిన ఓ ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్ అన్నీ భాష‌ల‌కు సంబంధించిన ఓవ‌ర్ సీస్ హ‌క్కుల‌ను రూ.70 కోట్ల‌కు చేజిక్కించుకున్న‌ట్లు తెలుస్తోంది.

అయితే చైనా విడుద‌ల హ‌క్కుల కాకుండా ఈ ధర పలికినట్లు సమాచారం. అద్భుతమైన రీతిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూలై 30న విడుద‌ల కానుంది.

చదవండి: అభిమానులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన తారక్…