

హైదరాబాద్: ఈ మధ్యకాలంలో మన తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుసగా బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. మహానటితో మొదలైన ఈ ప్రయాణం నియ్ ఎన్టీఆర్ బయోపిక్ వరుకు కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలో టాలీవుడ్ లో ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కే సినిమాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.
నెగెటివ్ పాత్రనే…చేస్తుందో లేదో..
ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ ఇప్పటికే ఎన్టీఆర్ జీవితం పై సినిమా చేసాడు. ఈ సినిమాని బాలకృష్ణ రెండు భాగాలుగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతికి విడుదలైంది. అలాగే ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 22 విడుదలకి సిద్ధంగా ఉంది.
ఇకపోతే మరోవైపున రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ టైటిల్ తో ఒక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నాడు. మరో వైపున లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి సన్నాహాలు చేసుకుంటున్నాడు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ సినిమాను గురించి మాట్లాడుతూ ..”ఈ సినిమాలో లక్ష్మీపార్వతి పాత్రకిగాను నూటికి నూరు శాతం శ్రీరెడ్డినే అనుకున్నాము. శ్రీరెడ్డికి కథగా చెప్పినప్పుడు చేయడానికి ఆమె అంగీకరించింది .. ఇంకా సీన్స్ గా చెప్పలేదు. సీన్స్ గా చెప్పినప్పుడు ఆమెకి ఏమైనా అభ్యంతరం వుంటే అప్పుడు ఆలోచిస్తాను అని చెప్పింది..” అని చెప్పాడు.
ఇంకా అయన మాట్లాడుతూ..” ప్రస్తుతానికైతే ఆమెనే ప్రధాన పాత్రధారి. ఈ పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉంటాయి గనుక శ్రీరెడ్డి అభ్యంతరం చెప్పొచ్చు. వీరగంధం వెంకట సుబ్బారావు జీవితంలోకి అడుగుపెట్టిన లక్ష్మీపార్వతి .. అక్కడి నుంచి ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించడం, ఆ తరువాత ఏర్పడిన రాజకీయ సంక్షోభం గురించి ఈ సినిమా ఉంటుంది” అని ఆయన స్పష్టం చేశారు.








