
- Advertisement -
హైదరాబాద్: సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘సాహో’ సినిమా రూపొందుతోంది. బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తుంది. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ చేస్తున్న చిత్రం ‘సాహో’ దాాదాపు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళంలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈసినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ సినిమాలో శ్రద్దాకపూర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2 కు సోషల్ మీడియాలో దుమ్ము దులిపేస్తోంది. ఇప్పటికే ‘సాహో’ మూవీ 24 గంటల్లో 2.9 మిలియన్ లైక్స్ సాధించింది. ఒక రోజుల్లో ఈ స్థాయిలో వ్యూస్ రాబట్టిన మేకింగ్ వీడియోగా సాహో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఓవర్సీస్‌లో ఈ సినిమా రైట్స్ అన్నిభాషలకు కలిపి రూ.42 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం.
దసరా కానుకగా అక్టోబర్‌లో …
ఈ సినిమా, ఇప్పటికే కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఈ సినిమాకి ఇంటర్వెల్ ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుందట. హైదరాబాద్ – రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ ఇంటర్వెల్ ఎపిసోడ్ ను భారీస్థాయిలో చిత్రీకరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ ఇంటర్వెల్ ఎపిసోడ్ కోసమే దాదాపు 30 కోట్లను ఖర్చు చేయనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణులు . స్టంట్ మాస్టర్లు పనిచేస్తున్నారు. ఈ సినిమాలో జాకీష్రాఫ్ .. నీల్ నితిన్ ముఖేశ్, మందిరా బేడీ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీనగానీ .. దసరా కానుకగా అక్టోబర్లో గాని విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.
- Advertisement -








