22.1 C
Hyderabad
Saturday, November 28, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ ఎట్టకేలకు కరోనాను జయించిన గాయని కనిక.. ఈసారి నెగటివ్!

ఎట్టకేలకు కరోనాను జయించిన గాయని కనిక.. ఈసారి నెగటివ్!

- Advertisement -

లక్నో:  బాలీవుడ్ గాయ‌ని క‌నికా క‌పూర్‌కు ఎట్టకేలకు కరోనా మహమ్మారిని జయించింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్ రిపోర్టులు రావడంతో ఆమె కుటుంబం ఊపిరిపీల్చుకుంది.

ప్ర‌స్తుతం ఆమె ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని సంజ‌య్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ ఆసుప‌త్రిలో కనిక చికిత్స తీసుకుంటోంది.

గత నెలలో కరోనా పాజిటివ్‌ రావడంతో ఆమెను ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.  ఆమెకు వరుసగా నాలుగు సార్లు కరోనా టెస్టు చేయగా పాజిటివ్‌ రావడంతో ఆమె కుటుంబ స‌భ్యులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురయ్యారు.

ఇది చదవండి: భార్యాభర్తల మధ్య కరోనా చిచ్చు

తాజాగా ఐదోసారి ఆమెకు  నిర్వహించిన కోవిడ్‌-19 పరీక్షలో  రిపోర్టులు నెగిటివ్‌గా వచ్చాయి. లక్నోలోని పీజీఐ ఆస్పత్రిలోనే మరికొన్ని రోజుల పాటు ఉంచి మరోసారి నెగిటివ్‌ వచ్చిన తర్వాత కనికను డిశ్చార్జ్‌ చేయనున్నట్టు వైద్యులు తెలిపారు.

- Advertisement -