బాహుబలితో జోడి కట్టనున్న సమంత!

Samantha-ruth-prabhu
- Advertisement -

హైదరాబాద్: తెలుగు, తమిళ భాషల్లో వరుస విజయాలతో సమంత దూసుకుపోతోంది. ఇటీవల కాలంలో నటనకి ప్రాధాన్యత కలిగిన విభిన్నమైన పాత్రలను చేస్తూ మరిన్ని మార్కులను కొట్టేస్తోంది. అలాంటి సమంత త్వరలో ప్రభాస్ సరసన కనిపించనుందనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.

ప్రస్తుతం ప్రభాస్ ఒక వైపున ‘సాహో’ షూటింగులోను మరో వైపున ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలోను చేస్తున్నాడు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి ‘జాన్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ ప్రాజెక్టు తరువాత ఆయన దిల్ రాజు నిర్మాణంలో ఒక సినిమా చేయనున్నట్టుగా తెలుస్తోంది.

ఒక క్రేజీ డైరెక్టర్ తో కథను సిద్ధం చేయిస్తోన్న దిల్ రాజు, ఈ సినిమాలో కథానాయికగా సమంతను ఎంపిక చేసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తోన్న సినిమాలు పూర్తికాగానే, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంటున్నారు.

- Advertisement -