25.6 C
Hyderabad
Saturday, November 28, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ మరో ఆసక్తికరమైన టైటిల్‌తో వస్తున్న సాయిధరమ్ తేజ్….

మరో ఆసక్తికరమైన టైటిల్‌తో వస్తున్న సాయిధరమ్ తేజ్….

- Advertisement -

హైదరాబాద్: మొన్నటివరకు వరుస ఫ్లాపులతో ఢీలా పడిపోయిన మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తాజాగా ‘చిత్రలహరి’ సినిమాతో సక్సెస్ రుచి చూశాడు. 1990లలో దూరదర్శన్‌లో ప్రతి శుక్రవారం రాత్రి 7:30 గంటలకు ప్రసారమయ్యే పాటల కార్యక్రమం చిత్రలహరిని టైటిల్ గా పెట్టుకుని తేజ్ మంచి విజయాన్నే సొంతం చేసుకున్నాడు.

ఇక ఈ సినిమా తరవాత… సాయిధరమ్ తేజ్ తదుపరి చిత్రం మారుతి దర్శకత్వంలో వుంది. గీతా ఆర్ట్స్ వారు .. యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అయితే ఈ సినిమాకి ‘భోగి’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. టైటిల్ ను బట్టి ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది.  ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ జోడీగా మాళవిక శర్మ చేస్తున్నట్లు సమాచారం.

చదవండి: ఆర్‌ఆర్‌ఆర్ అప్‌డేట్: బ్రిటిష్ సైన్యంతో పోరాడిన ఎన్టీఆర్…
- Advertisement -