హిట్ కోసం పేరు మార్చుకున్న సాయి ధరమ్ తేజ్!

saidharma tej
- Advertisement -

హైదరాబాద్: న్యూమరాలజీలు, ఆస్ట్రాలజీల మీద నమ్మకాల్లేకపోయినా ఒక్కోసారి ఏదోఒక సెంటిమెంట్ మీద ఆధారపడక తప్పదు. పరిస్థితులు అడ్డం తిరిగినప్పుడు తావీదు మహిమల్ని విశ్వసించాల్సిందే. ఎంత పెద్ద హీరోలైనా జీరో సైజుకు పడిపోతున్నామన్న భయం పట్టుకున్నప్పుడు.. చేతికందిన సెంటిమెంట్‌నల్లా వాడేస్తున్నారు.

ఆ కోవలోకే వచ్చేశాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. వరసబెట్టి ఆరు బొమ్మలు తిరగబడ్డంతో తనకిక ‘అచ్చే దిన్’ లేనట్లేనని డిసైడ్ అవ్వాల్సిన దురవస్థ తేజూది. అందుకే ఈసారి ఏకంగా పేరునే మార్చేసుకుని ముందుకొస్తున్నాడు. ‘ధరమ్’ని తొలగించి ‘సాయి తేజ్’తో కమిట్ అవ్వాలన్నది అతగాడి నిర్ణయం.

సాయి తేజ్‌గా…

మామయ్య శివశంకర వరప్రసాద్ చిరంజీవిగా మారగా లేనిది.. నేను రెండక్షరాలు కుదించుకుంటే తప్పేముంది? అన్నది మెగా మేనల్లుడి లాజిక్. విజయ్ సాయి దేవరకొండ, సాయి తీసేసి విజయ్ దేవరకొండగా సెటిలయ్యాడు. రామ్ చరణ్ తేజ్ మొదటి సినిమా నుంచే ‘తేజ్’ లేకుండానే చెలామణీ అవుతున్నాడు.

ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ కూడా, జస్ట్ ‘సాయి తేజ్’గా మారిపోయాడు. తన తాజా చిత్రం ‘చిత్రలహరి’లోని పరుగుపరుగు అనే వీడియో సాంగ్‌లో ఈమేరకు క్లారిటీ కూడా ఇచ్చేశాడు. ‘సాయి తేజ్’ అనే అక్షరాల మీద ఒక కిరీటాన్ని నిలబెట్టి.. ఇదే ఇకనుంచి నా ‘బ్రాండ్ నేమ్’ అంటూ అనౌన్స్ చేశాడు. తేజూ ఎక్స్‌పరిమెంట్ ఏమవుతుందన్నది ఏప్రిల్ 12న విడుదలయ్యే ‘చిత్రలహరి’ ఫలితం తర్వాతే తెలుస్తుంది.

- Advertisement -